అన్వేషించండి

100 Percent Ethanol: ఇథనాల్ ఇంధనంపై కేంద్రం కీలక నిర్ణయం.. 100 శాతం ఇథనాల్‌తో దూసుకెళ్లనున్న కార్లు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ E100 ఇంధన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దాంతో కొన్ని రోజుల్లోనే 100 ఇథనాల్‌తో నడిచే వాహనాలు భారత రోడ్లపై దూసుకెళ్లనున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 100% ఇథనాల్‌ను ఇంధనంగా వాడటానికి కేంద్రం చట్టబద్ధ ఆమోదం తెలిపింది.
  • మారుతి, టొయోటా వంటి సంస్థలు వచ్చే ఏడాది ఇథనాల్ వాహనాలు తెస్తాయి.
  • ఇంధన ధర తగ్గించి, వాయు కాలుష్యం తగ్గిస్తుంది ఇథనాల్ ఇంధనం.
  • ఇంధన దిగుమతులు తగ్గించి, ఆత్మనిర్భర భారత్‌కు ఇథనాల్ తోడ్పడుతుంది.

దేశంలో 100 శాతం ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలకు చట్టపరమైన ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో భాగంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లకు మార్గం సుగమం సుగమమైంది.

ఈ చారిత్రాత్మక నిర్ణయం తర్వాత మారుతి సుజుకి, హ్యుందాయ్, టొయోటా వంటి దిగ్గజ కార్ల తయారీ సంస్థలు వచ్చే ఏడాది నుంచి 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనం  చేకూరుతుందో వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

ప్రభుత్వ నిర్ణయంతో ఏం జరుగుతుంది

ఇప్పటివరకు వాహనాల్లో ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే పరిమితిని స్పష్టం చేసింది. E20 పెట్రోల్.. ఇందులో 80 శాతం పెట్రోల్, 20% ఇథనాల్ కలుపుతారు. అయితే ప్రభుత్వం ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం వాహనాల్లో E100 ఇంధనం, అంటే 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌ను ఉపయోగించవచ్చు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన ఈ కొత్త వాహనాలు పూర్తిగా ఇథనాల్‌ ఇంధనంతో నడుస్తాయి. లేదా అవసరమైతే పెట్రోల్, ఇథనాల్ ఏ మిశ్రమంతోనైనా సులభంగా వెళ్తాయి. రాబోయే రోజుల్లో ఇంధన కొరత లేకుండా దేశంలోని మూలమూలలా ఇథనాల్ ఫ్యూయల్ స్టేషన్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి, టొయోటా, హ్యుందాయ్ ఏం చేయనున్నాయి

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఇథనాల్ కార్లను తీసుకురానున్నాయి. మారుతి సుజుకి ఇప్పటికే తన అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్ వాగన్ ఆర్ (WagonR) ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రోటోటైప్ మోడల్‌ రూపొందించింది. ఇది 20% నుంచి 85% కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో దూసుకెళ్తుంది. ఇప్పుడు దీనిని 100 శాతం ఇథనాల్‌కు అనుకూలంగా మార్చి వచ్చే ఏడాది లాంచ్ చేయనుంది. 

మరోవైపు, టొయోటా భారత్‌లో తన ప్రసిద్ధ సెడాన్ కార్ ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross) ఆధారంగా ప్రపంచంలోనే తొలి 100 శాతం ఇథనాల్‌తో నడిచే ప్రోటోటైప్ మోడల్‌ను తీసుకురానుంది. ఈ కారు ఇథనాల్‌తో నడవడమే కాకుండా, ఇందులో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇది దీనిని బాగా అడ్వాన్స్‌డ్‌గా మారుస్తుంది. హ్యుందాయ్ తమ వాహనాల ఇంజిన్లను సాంకేతిక లోపాలు లేకుండా 100 శాతం ఇథనాల్ తో వెళ్లేలా పూర్తిగా అప్‌డేట్ చేస్తోంది.

ప్రజలకు ప్రయోజనం ఉంటుందా..

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్య ప్రజలకు ఇథనాల్ చౌకైన ప్రత్యామ్నాయంగా మారనుంది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ధర తక్కువ అని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ప్రతి నెలా ఇంధన ఖర్చు కొంతమేర తగ్గుతుంది. 100% ఇథనాల్ అనేది ఒక గ్రీన్,  స్వచ్ఛమైన ఇంధనంగా లభిస్తుంది. దాంతో హానికారక పొగ, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. గాలి కాలుష్యం తగ్గడం ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

భారత్ తన అవసరానికి కావలసిన ముడి చమురులో 80 శాతం కంటే ఎక్కువ విదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. దీని కోసం బిలియన్ల కొద్దీ రూపాయలను ఖర్చు చేస్తుంది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే భారత్ ఆత్మనిర్భర్‌గా మారే ఛాన్స్ ఉంది. మన కరెన్సీ విలువ నిలకడగా ఉండటానికి వీలవుతుంది. 

Frequently Asked Questions

కేంద్ర ప్రభుత్వం ఇంధన వినియోగంపై తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటి?

వాహనాల్లో 100 శాతం ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. ఇది ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లకు మార్గం సుగమం చేస్తుంది.

కొత్త నిబంధనల ప్రకారం E100 ఇంధనం అంటే ఏమిటి?

E100 ఇంధనం అంటే 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌ను వాహనాల్లో ఉపయోగించడం. అంతకుముందు 20% ఇథనాల్ (E20) కలిపిన పెట్రోల్‌కు మాత్రమే అనుమతి ఉండేది.

ఏ కార్ల తయారీ సంస్థలు 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను తీసుకురానున్నాయి?

మారుతి సుజుకి, టొయోటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ కార్ల తయారీ సంస్థలు వచ్చే ఏడాది నుంచి 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి.

100 శాతం ఇథనాల్ ఇంధనం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఇథనాల్ పెట్రోల్ కంటే చౌకైనది, కాబట్టి ఇంధన ఖర్చులు తగ్గుతాయి. ఇది కాలుష్యాన్ని తగ్గించి, గ్రీన్ ఇంధనంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

100 శాతం ఇథనాల్ ఇంధనం దేశానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

భారత్ ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు సహాయపడుతుంది మరియు కరెన్సీ విలువను స్థిరంగా ఉంచుతుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
టాటా నెక్సాన్ EVకి పోటీగా వస్తున్న Hyundai Ioniq P EV.. లాంగ్‌ రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లు, లెవల్ 2 ADAS
సంక్రాంతి కానుకగా హ్యుందాయ్‌ కొత్త EV.. ₹9.79 లక్షల ధర, టాటా నెక్సాన్‌కు గట్టి పోటీ!
Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
కారు ఏసీపై ఈ గుర్తులు గమనించారా? వాటి అర్థాలు తెలిస్తే చలికాలంలోనూ హ్యాపీ జర్నీ!
RC Smart Cards: మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఏపీ వాహనదారుల చేతిలోకి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RC కార్డులు!
ఆంధ్రప్రదేశ్‌ వెహికల్ ఓనర్లకు గుడ్‌న్యూస్‌.. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RCలు వచ్చేస్తున్నాయోచ్‌!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget