అన్వేషించండి

మన దేశంలో అత్యంత ఎత్తైన సీట్‌ ఉన్న 10 బైక్‌లు - వీటిని కొనాలంటే మీ హైట్‌ ఎక్కువ ఉండాలి!

భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఎత్తైన సీట్‌ హైట్‌ ఉన్న 10 బైక్‌లు ఇవే. అడ్వెంచర్‌, ఆఫ్‌రోడ్‌ బైక్‌ల సీట్‌ హైట్‌, స్పెసిఫికేషన్లు, పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tallest Seat Height Bikes 2026 India: భారత్‌లో మోటార్‌సైకిల్‌ కొనుగోలు చేసే సమయంలో చాలామంది ముందుగా చూసేది మైలేజ్‌, ఇంజిన్‌ సామర్థ్యం, ధర. కానీ అడ్వెంచర్‌ లేదా ఆఫ్‌రోడ్‌ బైక్‌ల విషయంలో సీట్‌ హైట్‌ చాలా కీలకం. ఎందుకంటే సీట్‌ ఎక్కువ ఎత్తులో ఉంటే, తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు బైక్‌ను హ్యాండిల్‌ చేయడం కష్టం అవుతుంది.

ప్రస్తుతం, భారత్‌లో రోడ్‌ లీగల్‌గా అమ్ముడవుతున్న అత్యంత ఎత్తైన సీట్‌ హైట్‌ ఉన్న 10 బైక్‌లను ఇప్పుడు మీ కోసం తీసుకొచ్చాం. ఈ లిస్ట్‌లో కనీస సీట్‌ హైట్‌ కూడా 860mm ఉండటం విశేషం.

10. Triumph Tiger 900 Rally Pro - 860mm నుంచి 880mm

అడ్వెంచర్‌ బైక్‌ల ప్రపంచంలో Triumph Tiger పేరు చాలా ఫేమస్‌. Tiger 900 Rally Pro అనేది ఆఫ్‌రోడ్‌ మీద ఎక్కువగా ఫోకస్‌ చేసిన వేరియంట్‌. 21/18 అంగుళాల క్రాస్‌ స్పోక్‌ వీల్స్‌, లాంగ్‌ ట్రావెల్‌ సస్పెన్షన్‌ కారణంగా దీని సీట్‌ హైట్‌ 860mm నుంచి 880mm వరకు అడ్జస్ట్‌ చేయవచ్చు. ఈ లిస్ట్‌లో ఇది అత్యంత ‘అందుబాటు’ సీట్‌ హైట్‌ గల బైక్‌.

9. KTM 390 Adventure R - 880mm

అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న Enduro R స్పెక్స్‌తోనే భారత్‌లోకి వచ్చిన 390 Adventure R, సస్పెన్షన్‌, వీల్స్‌, టైర్ల పరంగా పూర్తిగా ఆఫ్‌రోడ్‌ ఫోకస్‌ చూపిస్తుంది. దీని సీట్‌ హైట్‌ 880mm. యూరప్‌ మోడల్‌తో పోలిస్తే ఇండియన్‌ వేరియంట్‌ 10mm ఎక్కువ ఎత్తు కలిగి ఉండటం ఆసక్తికరం.

8. BMW R 1300 GSA - 870mm నుంచి 890mm

BMW GS Adventure అంటే ఆఫ్‌రోడ్‌ సామర్థ్యానికి గుర్తు. కొత్త R 1300 GSA మోడల్‌లో డిజైన్‌తో పాటు సీట్‌ హైట్‌ను కొంత తగ్గించారు. అయినా కూడా 870 నుంచి 890mm మధ్య ఉండే ఈ సీట్‌ హైట్‌ తక్కువ ఎత్తు రైడర్లకు సవాల్‌గా ఉంటుంది.

7. Triumph Tiger 1200 Rally Pro / Explorer - 875mm నుంచి 895mm

బిగ్‌ బోర్‌ అడ్వెంచర్‌ బైక్‌లలో Tiger 1200 కీలకమైన పేరు. భారీ ఫ్యూయల్‌ ట్యాంక్‌, లాంగ్‌ ట్రావెల్‌ సస్పెన్షన్‌తో ఇది 875 నుంచి 895mm సీట్‌ హైట్‌ను అందిస్తుంది. త్వరలో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

6. Kawasaki KLX230 - 880mm

పూర్తి ఎండ్యూరో డిజైన్‌తో వచ్చిన KLX230 కాగితంపై 880mm సీట్‌ హైట్‌ చూపిస్తుంది. అయితే సాఫ్ట్‌ సస్పెన్షన్‌ కారణంగా రైడర్‌ కూర్చోగానే బైక్‌ కొంత దిగుతుంది. కేవలం 139 కిలోల కర్బ్‌ వెయిట్‌తో ఈ లిస్ట్‌లో అతి తేలికైన బైక్‌ ఇదే.

5. Ducati Hypermotard 950 SP - 890mm

పూర్తి హూలిగన్‌ క్యారెక్టర్‌ ఉన్న Hypermotard 950 SP, ప్రీమియం Ohlins సస్పెన్షన్‌తో 890mm సీట్‌ హైట్‌ను ఇస్తుంది. స్టాండర్డ్‌ మోడల్‌ కంటే ఇది మరింత ఎత్తుగా ఉంటుంది.

4. Hero Xpulse 200 4V Pro - 891mm

Xpulse 200 4V Pro ను ఆఫ్‌రోడ్‌ లవర్స్‌ కోసం రూపొందించారు. 250/220mm సస్పెన్షన్‌ ట్రావెల్‌ కారణంగా దీని సీట్‌ హైట్‌ 891mm. ఇది ఈ లిస్ట్‌లో నాలుగో అత్యంత ఎత్తైన బైక్‌.

3. KTM 390 Enduro R - 895mm

ఎక్స్‌పోర్ట్ స్పెక్స్‌తో వచ్చిన కొత్త 390 Enduro Rలో 230mm సస్పెన్షన్‌ ట్రావెల్‌ ఉంది. దీంతో సీట్‌ హైట్‌ 895mmకి పెరిగింది. ఆఫ్‌రోడ్‌లో ఇది నిజంగా తన పవర్‌ను చూపిస్తుంది.

2. Ducati Hypermotard 698 Mono - 904mm

ప్రస్తుతం ప్రొడక్షన్‌లో ఉన్న అత్యంత శక్తిమంతమైన సింగిల్‌ సిలిండర్‌ బైక్‌ ఇదే. 904mm సీట్‌ హైట్‌తో ఇది రెండో స్థానంలో నిలిచింది.

1. Ducati DesertX Rally - 910mm

ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నది Ducati DesertX Rally. 910mm సీట్‌ హైట్‌తో భారత్‌లో షోరూమ్‌ నుంచి నేరుగా కొనగలిగే అత్యంత ఎత్తైన రోడ్‌ లీగల్‌ బైక్‌ ఇదే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget