అన్వేషించండి

Yearly Horoscope 2024: మీ రాశిప్రకారం మీరు తీసుకోవాల్సిన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఇవే!

New Beginnings Horoscope for 2024: నూతన ఏడాదికి స్వాగతం చెప్పే క్షణాలు వచ్చేశాయి. మరి కొత్త సంవత్సరంలో మీ రాశి ప్రకారం వచ్చే మార్పులేంటో తెలుసా...

Yearly Horoscope 2024: కొత్త సంవత్సరం కోటి ఆశలతో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మీ రాశి ప్రకారం నూతన సంవత్సరంలో వచ్చే మార్పులేంటి? మీరు చేసుకోవాల్సిన మార్పులేంటి? ఇక్కడ తెలుసుకోండి..

మేష రాశి (Aries Yearly Horoscope 2024) 

ఈ ఏడాది మీ జీవితంలో రాబోయే మార్పులను అంగీకరించండి. కొత్తప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మరింత నేర్చుకునేందుకు ప్రయత్నించండి.మీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతారు. కొత్త ఆలోచనలను అంగీకరించండి. ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించాలి. కష్టపడి పనిచేస్తే పదోన్నతి పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో నిజాయితీగా వ్యవహరించాలి.  

వృషభ రాశి (Taurus  Yearly Horoscope 2024)

మీ ఆత్మవిశ్వాసం మరంతి పెరుగుతుంది. మరింత మెరుగవడంపై దృష్టి సారించాలి. భవిష్యత్ గురించి కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు అవి, అమలు చేసేందుకు ఇదే మంచి సమయం. మిమ్మల్ని మీరు నమ్మండి. మెరుగైన ఉద్యోంలో స్థిరపడతారు. కొత్తగా ప్రారంభించే పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. మీ బంధాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో స్ట్రాంగ్ గా ఉండడం ముఖ్యం.  తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. 

Also Read: మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!

మిథున రాశి (Gemini Yearly Horoscope 2024) 

2024 లో మీతో మీరు సమయం స్పెండ్ చేయండి.  ఒంటరిగా గడపడం ద్వారా మీ గురించి మరింత తెలుసుకోండి. ఇప్పటి వరకూ మీరు ఎదగడానికి ఏం చేశారో ఆలోచించండి. మీ గట్ మీకు ఏమి చెబుతుందో తెలుసుకోండి. పనిలో మీ భావాలపై ఆధారపడండి..మరింత కొత్తగా ఆలోచించండి. మీకున్న పరిచయాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ఈ రోజు ప్రారంభించే ప్రాజెక్టులు మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కానీ భవిష్యత్ లో మంచి విజయాన్ని అందిస్తాయి. కుటుంబ సంబంధాలు కష్టంగా అనిపిస్తాయి. కుటుంబానికి మెరుగైన సమయం కేటాయించడం ద్వారా కొంత ప్రశాంతత పొందొచ్చు. ఆధ్యాత్మికవిషయాలపై లోతుగా అన్వేషించండి. 

కర్కాటక రాశి (Cancer Yearly Horoscope 2024)  

అందరితో కలిసేందుకు, కలసి పనిచేసేందుకు నూతన సంవత్సరంలో ప్రయత్నించాలి...ఇదే మీ వృద్ధికి దారితీస్తుంది. కొత్త అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయ్..అవి మిమ్మల్ని కెరీర్లో ఓ మెట్టు పైకి ఎక్కించే ఛాన్సుంది.  టీమ్‌వర్క్ చేయండి. కొత్త ఆలోచనలను అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో వృద్ధి చెందుతారు. కుటుంబ బంధాలు మెరుగుపడతాయి. స్నేహాలను పెంచుకునేందుకు, నిజాయితీగా వ్యవహరించేందుకు ఇది మీకు అద్భుతమైన సమయం.

Also Read: ఆదిత్య మంగళ రాజయోగం, ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్స్!

సింహ రాశి (Leo Yearly Horoscope 2024)

2024 సింహరాశివారి జీవితంలో నూతన వెలుగులు తీసుకొచ్చే సమయం. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ గట్స్ మీకు ప్లస్ అవుతాయని గుర్తించండి. స్మార్ట్ గా వర్క్ చేయండి. నూతన స్నేహితులను జీవితంలోకి ఆహ్వానించండి. ప్రతినిత్యం ఉత్సాహంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు, మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఎవ్వరి మాటల ప్రభావం మీపై ఉండకూడదు.. నిజమే మాట్లాడేందుకు ప్రయత్నించాలి. 

కన్యా రాశి  (Virgo Yearly Horoscope 2024) 

కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉంటుంది. ప్రయాణంలో చాలా జ్ఞాపకాలు పోగుచేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. కొత్త అవకాశాలు మీకు వచ్చినప్పుడు వినియోగించుకోండి. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకునేందుకు మంచి సమయం. మీ ఆలోచనా విధానం,సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. కుటుంబ సవాళ్లను సానుకూల దృక్ఫథంతో స్వీకరించాలి. 

తులా రాశి (Libra Yearly Horoscope 2024) 

మీలో ఉండే ప్లస్-మైనస్ లు సరిచూసుకోండి. అవసరం లేనివాటిని వదిలేసి మార్పును అంగీకరిస్తేనే జీవితంలో వృద్ధి సాధిస్తారు. ప్రతిదీ సమతుల్యంగా ఉండాలని గుర్తుంచుకోండి ఎందుకంటే సామరస్యంగా ఉండటం మీ ఆరోగ్యానికి అవసరం. కొత్త భాగస్వామ్యాలకు సిద్ధంగా ఉండండి. కుటుంబంలో కొనసాగుతున్న ఏవైనా సమస్యలను అవగాహనతో పరిష్కరించండి. మీ ప్రేమ జీవితంలో విశ్వాసం ముఖ్యం..అభద్రతలో ఉండొద్దు.

Also Read: మీ న్యూ ఇయర్ ప్లాన్ లో దైవసందర్శన ఉందా - తెలంగాణలో ముఖ్యమైన ఆలయాలివే!

వృశ్చిక రాశి (Scorpio Yearly Horoscope 2024) 

ఈ సంవత్సరం ఈ రాశి వ్యాపారాల్లో భాగస్వామ్యాలు చాలా ముఖ్యమైనవి, అవి మీరు ఎదగడానికి, విజయం సాధించడానికి, సంతోషంగా ఉండటానికి సహాయపడతాయి.  స్నేహితులను భాగస్వాములను చేసుకోండి ఇవి మీ కెరీర్ వృద్ధికి సహాయపడతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు , వ్యాపారాలను చేపట్టాల్సి రావొచ్చు. వాటిని గురించి ధైర్యంగా , ఉత్సాహంగా ఉండండి. ఈ సంవత్సరం కుటుంబ సంబంధాలు మీకు సహాయంగా నిలుస్తాయి. బంధంలో మరింత సంతోషం పెరుగుతుంది. ఒకరినొకరు గౌరవించుకోండి..ఒకరినొకరు తెలుసుకోవడంపై దృష్టి సారించండి.

ధనుస్సు రాశి  (Sagittarius Yearly Horoscope 2024) 

2024లో మీ జీవితంలో రాబోయే మార్పులకు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, ఉద్యోగ అవకాశాల కోసం వెతకడంపై దృష్టి పెట్టండి. 2024 అంతటా, ఆశాజనకంగా ఉంటుంది. గ్రహాలు అనుగ్రహం మీపై ఉంటుంది. మీ వ్యక్తిగతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి..కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ జీవితంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 

మకర రాశి (Capricorn Yearly Horoscope 2024) 

నూతన సంవత్సరంలో మీరు వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మీ ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ మార్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసం వదులుకోవద్దు, పట్టుదలగా ఉండాలి. కుటుంబ సభ్యుల అవసరాలను పట్టించుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి 

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ తిరుగులేదంతే!

కుంభ రాశి  (Aquarius Yearly Horoscope 2024) 

మీ మనసు చెప్పింది వినండి. మీ కెరీర్ కి సంబంధించి బలమైన పునాది నిర్మించుకునేందుకు ఈ ఏడాది మంచి సమయం. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రియమైన వారితో బంధాన్ని బలపర్చుకోవాలి. మీ ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి  రియల్ ఎస్టేట్, వ్యాపారాలు కలిసొస్తాయి. కుటుంబ బంధాలు వృద్ధి చెందుతాయి. మంచి స్నేహితులను వదులుకోవద్దు. 

మీన రాశి (Pisces Yearly Horoscope 2024) 

మీలో మీరే ఆగిపోవద్దు..ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ఇది మీ జీవితంలో పురోగతికి ఉపయోగపడుతుంది. కెరీర్లో వచ్చే నూతన అవకాశాలను స్వాగతించేందుకు సిద్ధంగా ఉండాలి. మీలో ఉండే కమ్యూనికేషనా నైపుణ్యాలు వృత్తిపరంగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. మీ ఆలోచనలను చర్చించండి..కలసి పనిచేయడానికి వెనుకాడకండి. కొత్త ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నించాలి. స్పష్టంగా మాట్లాడండి, జాగ్రత్తగా వినండి..అర్థవంతమైన చర్చలు చేయండి. బంధాలను, స్నేహాలను బలోపేతం చేసుకునేందుకు, జ్ఞాపకాలు పోగేసుకునేందుకు ఈ ఏడాది మీకు శుభసమయం. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget