Palmistry: మీ అరచేతిలో ఈ గుర్తులున్నాయా..అయితే గట్టిగా సంపాదిస్తారు!
Palmistry In Telugu: అదృష్టవంతుల అరచేతిలో ఈ గుర్తులు కలిగి ఉంటారు..ఈ మూడు గుర్తుల్లో ఒక్కటి ఉన్నాకానీ అకస్మాత్తుగా డబ్బు పొందుతారు
Lucky Symbols on the Palm: హస్తసాముద్రికం ...అరచేతిలో సంకేతాలు, ఆకారాలు , చిహ్నాల ఆధారంగా చెబుతారు. హస్తసాముద్రికంలో ముఖ్యంగా నాలుగు రేఖలను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంటారు. చేతిలో ఉన్న నాలుగు పంక్తులను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు..దీనిద్వారా ఓ వ్యక్తి జీవితం మొత్తాన్ని చెప్పేయవచ్చంటారు. ముఖ్యంగా ఆయుష్షు, అదృష్టం, సంపద, సామర్థ్యం...వీటన్నింటినీ డిసైడ్ చేసేది ఆ నాలుగు గీతలే. అయితే ఈ నాలుగు రేఖల ఆకారాలు, వాటి కలయిక ఆధారంగా కొన్ని గుర్తులు ఏర్పడతాయి. వాటిలో ముఖ్యమైనవి త్రిభుజం, కమలం, చేపగుర్తు..ఇవి చేతిలో ఉంటే కలిసొచ్చే అదృష్టం ఏంటి? మీ చేతిలో ఈ రేఖలున్నాయా? చెక్ చేసుకోండి..
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!
త్రిభుజం
హస్తసాముద్రికంలో త్రిభుజాన్ని చాలా పవిత్రమైన చిహ్నంగా పరిగణిస్తారు. అరచేతిలో ఉండే విధి రేఖ, ఆరోగ్య రేఖ మెదడు రేఖతో ఏర్పడిన త్రిభుజాన్ని సంపద స్టోర్‌హౌస్ అంటారు. ఈ త్రిభుజం మూడు వైపులా రేఖలు మూసివేసి ఉండడాన్నే శుభప్రదంగా పరిగణిస్తారు. అరచేతిలో త్రిభుజం ఉన్నవారు ఎంతో సంపద పొందుతారు. త్రిభుజం లోపల క్రాస్ మార్క్ ఉంటే వారి చేతిలో సంపద నిలవదు అని అర్థం. అరచేతిపై పెద్ద త్రిభుజం గుర్తు ఉంటే వారు చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు మరొకరికి గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించరు. ఎవరికైనా కానీ సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.
Also Read: 2024 ఈ రాశులవారికి హ్యాపీ ఎండింగ్.. డిసెంబర్ మాస ఫలాలు!
లోటస్ సింబల్
ఓ వ్యక్తి అరచేతిలో కమలం గుర్తు ఉన్నట్లయితే ఆ వ్యక్తిని చాలా అదృష్టవంతుడుగా భావిస్తారు. కమలం లక్ష్మీనారాయణుల చిహ్నంగా భావిస్తారు. కమలం చిహ్నం ఉన్న వ్యక్తిని విష్ణువు అనుగ్రహిస్తాడు. ఈ సింబల్ ఉన్న వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు ఫుష్కలంగా ఉంటాయి. వీరి జీవితంలో డబ్బుకి అస్సలు లోటుండదు. లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది..ఎప్పటికీ ఆర్థిక సమస్య ఉండదు. ఎప్పుడూ సంపాదించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది.
చేప గుర్తు
అరచేతి పైభాగంలో మణికట్టు దగ్గర ప్రాణరేఖపై చేప గుర్తు ఉంటే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ చిహ్నం ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. విదేశీ వ్యాపారాలు వీరికి బాగా కలిసొస్తాయి. ఇంటా బయటా గౌరవం పొందుతారు. వారసత్వ ఆస్తులు కూడా వీరికి బాగా కలిసొస్తాయి. బొటనవేలు క్రింద చేపగుర్తు ఉండేవారు అందమైన శరీరాకృతి కలిగి ఉంటారు. వారి జీవితం వెలిగిపోతుంది, చాలా రొమాంటిక్ గా ఉంటారు. మధ్యవేలు కింది భాగంలో చేప గుర్తు ఉంటే వీరు చాలా రహస్య స్వభావం కలిగి ఉంటారు. చూపుడు వేలు కింద భాగంలో చేపగుర్తు ఉండేవారు చాలా తెలివైనవారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు.
Also Read: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ ఆన్ లైన్లో ఇలా ఈజీగా చేసేసుకోండి!
Note: వివిధ పుస్తకాలు, ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...
ABP దేశంలో మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి