News
News
X

Weekly Horoscope in telugu (13-19 March): ఈ వారం ఈ రాశివారికి మంచి అవకాశం రాబోతోంది,ఆదాయం పెరుగుతుంది - మార్చి 13 -19 వారఫలాలు

Weekly Horoscope (13-19 March 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope in telugu (13-19 March) : మార్చి 13 సోమవారం నుంచి మార్చి 19 ఆదివారం వరకూ   ఈ ఆరు రాశులవారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అన్నింటా మంచి ఫలితాలు పొందుతారు

మేష రాశి 

ఈ వారం ప్రారంభంలో మీరు కొన్ని ఆహ్లాదకరమైన వార్తలు వింటారు.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పనిని బాధ్యతగా తీసుకున్నా దానిని మంచి మార్గంలో నిర్వహించగలుగుతారు. కార్యాలయంలో సీనియర్, జూనియర్ ఇద్దరి నుంచి మంచి సహకారం ఉంటుంది. ఈ సమయంలో, వృత్తికి సంబంధించి చేసే ప్రయాణాలు శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థకి పరిస్థితి బావుంటుంది కానీ ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల కొంత గందరగోళంగా ఉంటుంది.  ఆలోచనాత్మకంగా ఖర్చు చేయకుంటే వారాంతంలో ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి..సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

వృషభ రాశి 

వృషభరాశివారికి వారం ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులు పొందుతారు. సౌకర్యానికి సంబంధించిన విషయాలకు డబ్బు ఖర్చు చేస్తారు. మీరు చాలా కాలంగా ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తుంటే..మీకు మంచి అవకాశం రాబోతోంది సద్వినియోగం చేసుకోండి. పనిచేసే మహిళలకు కార్యాలయంలో, ఇంట్లో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా విదేశాల్లో కెరియర్ కోసం ప్రయత్నిస్తున్న వారు గొప్ప విజయాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాల పరంగా సమయం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపుకతారు.

Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి

సింహ రాశి

సింహ రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. పెద్ద ప్రాజెక్టులో చేరాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. ఇది మీకు  ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగుల పనికి కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. సీనియర్లు మీకు పెద్ద బాధ్యతను అప్పగిస్తారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు నిజమయ్యేలా చూస్తారు. కొంతకాలంగా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ వారం కొంత మెరుగుదల ఉంటంది. ఆర్థిక విషయాల్లో నిదానంగా, స్థిరంగా పురోగతి కనిపిస్తుంది. భౌతిక ఆనందం పెరుగుతుంది. చాలా కాలంగా వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తే మీ కోరిక నెరవేరుతుంది. ప్రేమ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ప్రేమ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలను గడపడానికి అవకాశం లభిస్తాయి.  

కన్యా రాశి

ఈ వారం ప్రారంభంలోనే మిమ్మల్ని వెంటాడుతున్న కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో చిక్కుకున్నవారికి తీర్పు మీకు అనుకూలంగా రావొచ్చు. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు, మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మరియు మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తుల అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు చాలా కాలంగా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే అడుగుపడుతుంది. స్థిరాస్తులు కొనడం లేద అమ్మడం కూడా మీకు కలిసొస్తుంది...ఈ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మార్కెట్ లో పురోభివృద్ధి ఉంటుంది. మీపై విశ్వసనీయత పెరుగుతుంది. పనితో పాటు, మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు చాలా కాలంగా మీ ప్రేమను ఒకరి ముందు వ్యక్తపరచాలని ఆలోచిస్తుంటే వారం మధ్యలో ప్రయత్నించడం. అప్పులు తీసుకోవడం మానుకుంటే మంచిది.

తులా రాశి 

ఈ వారం తులారాశివారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగులు, వ్యాపారులు ఆచితూచి అడుగేయాలి. మీకు ఎదురైన సమస్యలపై వెనక్కు తగ్గేబదులు వాటికి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించండి. కోరుకున్న విజయం మిమ్మల్ని వరించాలంటే హార్డ్ వర్క్ చేయాలి. పనిచేసే ప్రదేశంలో సీనియర్లు, జూనియర్లతో మెరుగైన సమన్వయం పాటించాలి. ప్రేమ సబంధాలు కొనసాగాలి అంటే తొందరపాటు మానుకుని ఆలోచనాత్మకంగా ముందుకుసాగాలి. మీకు ఎలాంటి కష్టకాలంలో అయినా జీవిత భాగస్వామినుంచి అండ ఉంటుంది.  అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. వారం మధ్యలో మీకు అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. 

Also Read: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!

ధనుస్సు రాశి  

ధనస్సు రాశివారికి ఈ వారం అధ్భుతంగా ఉంది. కుటుంబంలో ఉన్న సమస్యలు కొంతవరకూ పరిష్కారం అవుతాయి. స్నేహితుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఈ రాశివ్యాపారులు వారం మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  సంబంధాల విస్తరణ పరంగా ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా, శుభప్రదంగా ఉంటుంది. ఇంటికోసం అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవివాహితుల ప్రయత్నాలు ఫలిస్తాయి...సంబంధాలు కుదరుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

Published at : 13 Mar 2023 06:00 AM (IST) Tags: weekly horoscope in telugu 13th to 19th march 2023 Weekly Horoscope Aries Weekly Horoscope in Telugu Tarus Weekly Horoscope in Telugu Leo Aries Weekly Horoscope in Telugu Virgo Aries Weekly Horoscope in Telugu Sagittarius weekly horoscope in telugu

సంబంధిత కథనాలు

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

ఈ తేదీన రాహు-చంద్ర గ్రహణ యోగం – ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే..

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

మార్చి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనుకావొద్దు - మీ మనసు చెప్పింది ఫాలో అవండి

మార్చి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనుకావొద్దు - మీ మనసు చెప్పింది ఫాలో అవండి

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గతంలో కన్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి కానీ!

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గతంలో కన్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి కానీ!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌