Weekly Horoscope October 24 to 30: ఈ వారం ఈ రాశివారి ఆధిపత్యం, ఆర్థిక స్థితి రెండూ మెరుగుపడతాయి!
Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Weekly Horoscope 2022 October 24 to October 30: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం తులా రాశి నుంచి మీనరాశి వరకూ ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
తులా రాశి
ఈ వారం మీకు బాగానే ఉంటుంది. బుధ, గురువారాల్లో ఆదాయం మెరుగుపడుతుంది. ఏ పనిలోనైనా కష్టం తీరుతుంది. బయటి వ్యక్తి నుంచి సహకారం అందుతుంది. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వారం మీరు ఆస్తి నుంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ ఆధిపత్యం పెరుగుతుంది, కొత్త పరిచయం నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. శుక్ర- శనివారాల్లో మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. పనిప్రాంతంలో ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. పేదలకు ఆహారాన్ని దానం చేయండి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఈ వారం బుధ, గురువారాల్లో అనుకున్న పనులు పూర్తికావు. మీ సబార్డినేట్ లు నియంత్రణలో ఉండరు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శుక్ర, శనివారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సోమవారం మీకు మంచి రోజు. గణేషుడికి దూర్వాలు సమర్పించండి.
ధనుస్సు రాశి
మీరు చేయాలనుకున్న పనులు మంగళవారం పూర్తిచేస్తే మంచిది. బుధవారం , గురువారం కూడా మీకు ఉత్తమమైన రోజులు. మీరు మీ పనిలో విజయం ఆనందం పొందుతారు. మీ అన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి. పెద్దల నుంచి మీకు మద్దతు ఉంటుంది. శుక్ర, శనివారాలు మీకు మంచిది కాదు. అదనపు ఖర్చుులు తగ్గించండి. శనివారం మధ్యాహ్నం నుంచి మీకు అనుకూల సమయం.
మకర రాశి
ఈ వారం ప్రారంభం మీకు అద్భుతంగా ఉంటుంది. సోమ,మంగళవారాలు ఏం చేసినా కలిసొస్తుంది. మీ చేతిలో మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. బుధ, గురువారాల్లో ఆర్థిక పరిస్థితులు వేగంగా మెరుగుపడతాయి. పిల్లల కారణంగా సంతోషం పొందుతారు. ప్రయోజనకరమైన పరిచయాలను పొందుతారు. పని భారం ఎక్కువ ఉంటుంది. శుక్ర, శనివారాల్లో ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదు. ఖర్చులు తగ్గించాలి.దుర్గమ్మకి నేతితో దీపం వెలిగించాలి.
Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!
కుంభ రాశి
ఆదాయం తగ్గుతుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. ఈ వారం మీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. బుధవారం రోజు తలపెట్టే పని సకాలంలో పూర్తవుతుంది. గురు, శుక్రవారాల్లోనూ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులకు ప్రణాళికలు రూపొందిస్తారు. నిలిచిపోయిన పనిలో వేగం ఉంటుంది. శనివారం మీకు చాలా మంచి సమయం. పేదలకు పాత బట్టలు దానం చేయండి.
మీన రాశి
ఈ వారం మీ ఆదాయం మెరుగ్గా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. కానీ మీ మనస్సు కలత చెందుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి . ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. గురువారం నుంచి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. పనిలో వేగం పెరుగుతుంది. శుక్రవారం మీకు కలిసొస్తుంది.శివలింగం ముందు నెయ్యి దీపాన్ని ఉంచండి.