Weekly Horoscope October 24 to 30: ఈ వారం ఈ రాశులవారు ఖర్చులు తగ్గించకపోతే కష్టాలు తప్పవు!
Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Weekly Horoscope 2022 October 24 to October 30: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం మేష రాశి నుంచి కన్యారాశి వరకూ ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ వారం మేషరాశివారి ఆదాయం బావుంటుంది. వివాదాస్పద విషయాలలో మీదే పైచేయి. ప్రత్యేక స్నేహితుడి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ప్రత్యర్థులు ఆధిపత్యం చెలాయిస్తారు. దూర ప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు. అనవసర ఖర్చులు చేయొద్దు. హనుమంతుడికి నూనె దీపం వెలిగించండి.
వృషభ రాశి
ఈ వారం చాలా పనులు పూర్తిచేస్తారు. అనుకున్న ఏ పనీ పెండింగ్ పడదు. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. మంగళ, బుధవారాల్లో ఏ విషయంలోనూ తొందరపడకండి నష్టపోతారు. గురు, శుక్రవారాలు ఆహ్లాదరకంగా ఉంటుంది. ఆదాయం బావుంటుంది. శనివారం జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు, వివాదాలు పెరగొచ్చు.అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీ ప్రత్యర్థులు మీపై విజయం సాధిస్తారు. శ్రీకృష్ణుడికి తెల్లని పువ్వులు సమర్పించండి.
మిథున రాశి
ఈ వారం మీ ఆదాయం ఆశించినంతగా ఉండదు. మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనికి అంతరాయం కలుగుతుంది. సోమవారం,మంగళవారం కొంత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ఈ వారం ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉండొచ్చు. శనివారం మీకు ఉత్తమమైన రోజు. హనుమంతుడికి ఎరుపు పువ్వుల దండను సమర్పించండి
Also Read: దివాలీ ప్రత్యేక కథనాలన్నీ ఇక్కడ చూడొచ్చు
కర్కాటక రాశి
ఈ వారం కర్కాటక రాశివారికి మంచి ఆదాయంతో పాటూ సకాలంలో పనులు జరుగుతాయి. మీ సోదరుల నుంచి మద్దతు పొందుతారు. మంగళ, బుధవారాల్లో జాగ్రత్తగా పని చేయండి. అప్పులు అస్సలు తీసుకోవద్దు. గురు, శుక్రవారం మీకు అనుకూలంగా ఉంటుంది. శనివారం శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్తగా తలపెట్టిన పని సక్సెస్ అవుతుంది. శివునికి ధూపం వేయండి.
సింహ రాశి
ఈ వారం ఈ రాశివారు తల్లి కారణంగా సంతోషంగా ఉంటారు. కుటుంబం నుంచి మంచి మద్దతు లభిస్తుంది. బందువులను కలిసే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పిల్లల కారణంగా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. లక్ష్మీ దేవికి నేతితో దీపం పెట్టండి.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాణసంచా ఎందుకు కాలుస్తారు!
కన్యా రాశి
ఈ వారం కన్యారాశివారి ఆదాయం బాగుంటుంది. ఏ పనిలోనైనా వెనుకబడిన వారికి ముందుకు వచ్చే అవకాశం లభిస్తుంది. వివాదాస్పద విషయాల్లో మీ వైపు బలంగా ఉంటుంది. శనివారం మీకు అంతగా బావోదు..ఏపని మొదలెట్టినా సక్సెస్ కాలేరు. పిల్లల కారణంగా బాధపడతారు. మీ చుట్టూ ఉనన వ్యక్తులతో వివాదం ఉండొచ్చు. పేదలకు పండ్లు దానం చేయండి.