Weekly Horoscope: మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల వారికి అక్టోబర్ మొదటి వారం ఎలా ఉందంటే!
అక్టోబర్ 02 నుంచి అక్టోబరు 08 వరకూ వారఫలాలు: అక్టోబరు మొదటి వారం ఏ రాశులవారికి కలిసొస్తుందో ఇక్కడ తెలుసుకోండి
Weekly Horoscope 2 to 8 October 2023
మేష రాశి
ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు వారిపై మీరు శ్రద్ధ వహించాలి. అవసరానికి మించి ఖర్చు చేయకండి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ వారం నూతన పెట్టుబడులకు చాలా మంచిది. ఈ సమయంలో మీ లక్ష్యాలను సాధించాలనే ఆలోచనలు మాత్రమే మీ మనస్సులో నడుస్తాయి, దాని కోసం మీరు సమయం కేటాయించాలి. ఈ వారం ఈ రాశి విద్యార్థులకు చదువుపై కన్నా ఇంట్లో పనిపై ఆసక్తి పెరుగుతుంది. ఈ వారం కొంత నిరాశ తప్పదు. మంగళవారం రోజు కేతు గ్రహం కోసం యాగం చేయండి
వృషభ రాశి
ఈ సమయంలో మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా భూమి ఆస్తి వివాదంలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ కెరీర్‌లో అడ్డంకులు ఉండవచ్చు. మీవల్ల వేరేవారు ప్రయోజనం పొందుతారు. ప్రతిరోజూ లలితా సహస్రనామం జపించండి.
మిథున రాశి
ఈ వారం మీరు కొన్ని ఎలక్ట్రికల్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇది మీకు లాభాలను ఇస్తుంది. అనుకోని సమస్యలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పత్రాల విషయంలో విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఇది మీకు ఇబ్బంది, ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. ఈ వారం వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. నారాయణీయం అనే పురాతన వచనాన్ని ప్రతిరోజూ జపించండి.
Also Read: చనిపోయిన వారి ఫొటోలు మీ ఇంట్లో ఏ దిక్కున పెట్టారు!
కర్కాటక రాశి
ఈ వారం మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. నేర్చుకునేందుకు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఈ వారం కార్యాలయంలో మీ పైఅధికారులు, సబార్డినేట్‌లతో మీ గత వివాదాలన్నింటినీ ముగించడం ద్వారా వారితో మీ సంబంధాలను మెరుగుపరచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. జీతంలో పెరుగుదల ఉంటుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. "ఓం హనుమతే నమః" అని ప్రతిరోజూ 11 సార్లు జపించండి.
సింహ రాశి
ఈ రాశివారు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొందరగా అలసిపోతారు. వ్యాపారులు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఈ సమయంలో మీరు వైఫల్యాన్ని కూడా ఎదుర్కోవచ్చు. ఈ రాశికి చెందిన వారు, చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు ప్రయత్నాలు మమ్మురం చేయాలి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. "ఓం భాస్కరాయ నమః" అని ప్రతిరోజూ 19 సార్లు జపించండి.
కన్యా రాశి
ఈ వారం మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది, ఇది మీకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిది. మీరు కుటుంబంలోని పిల్లలతో మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యేవారికి ఇది మంచి సమయం. ప్రతిరోజూ 41 సార్లు "ఓం బుధాయ నమః" అని జపించండి.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారం చాలా ముఖ్యమైనది. తలపెట్టిన పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు.ఏడవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం వ్యాపారవేత్తలు తమ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. మీ ప్రణాళికను అందరితో పంచుకోవడం కొన్నిసార్లు మిమ్మల్ని పెద్ద ఇబ్బందులకు గురి చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. శనివారం ఆలయంలో హనుమంతుడిని పూజించండి.
వృశ్చిక రాశి
ఈ వారం ఈ రాశివారిలో కోపం పెరుగుతుంది. మీరు మీపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు ఏదైనా విషయంలో అశాంతిగా ఉంటే మీ కోసం ఖర్చు చేయడం, స్నేహితులతో బయటకు వెళ్లడం ద్వారా సంతోష క్షణాలు గడుపుతారు. ఉన్నత విద్యలో సరైన కెరీర్ ఎంపికను ఎంచుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా జపించండి
ధనుస్సు రాశి
ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. మీరు తరచుగా ఇతరులకు మీ సామర్థ్యం కంటే ఎక్కువగా వాగ్దానం చేస్తారు. కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా తగిన ఫలితం పొందలేరు. ఆ విజయం కోసం సమయం మీకు పరీక్ష పెడుతుంది.
ప్రతిరోజూ 11 సార్లు "ఓం మండాయ నమః" అని జపించండి
మకర రాశి
ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ గురించి అసౌకర్యంగా ఉంటారు. మీరు మీ సమయాన్ని మరియు ఈ సమయంలో మీకు లభించిన వాటిని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు.పనికిరాని పనుల కోసం మీ శక్తిని వృధా చేసుకోవద్దు. గురువారం వృద్ధులకు అన్నం దానం చేయండి.
కుంభ రాశి
ఈ వారం మీరు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు, ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ వారం విదేశాలకు వెళ్ళే మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. మీరు సమస్యలను ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఈ వారం మీ కుటుంబ సభ్యులతో ఆలోచనాత్మకంగా మాట్లాడండి. అనవసర మాటలు వద్దు. రోజూ లింగాష్టకం జపించండి.
Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
మీన రాశి
ఈ వారం మీరు వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కార్యాలయానికి మాత్రమే కాదు మీకోసం మీరు సమయం కేటాయించుకోవాలి. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులేకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. శనివారం వికలాంగులకు దానం చేయండి.