2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు
నోట్: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
![2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు Ugadi Panchangam in Telugu (2023-2024): according to your zodiac sign Your success rate in finance low in Sri Sobhakritu Nama Samvatsaram , know in details 2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/24/afb7cfa8827f765a97369364ec60d2391679649555479217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2023 Ugadi Panchangam in Telugu: తెలుగు సంవత్సరాది ఉగాది రాగానే రాశి ఫలితాలు కన్నా ముందుగా ఆదాయ-వ్యయాలు చూసుకుంటారు. ఎంత సంపాదిస్తాం, ఎంత ఖర్చుచేస్తాం అని లెక్కలేసుకుంటారు. వీటిని నమ్మేవారు శ్రద్ధగా చూసుకుంటే ఇంకొందరు సరదాగా ఆదాయ-వ్యయాలు తెలుసుకుంటారు. శోభకృత్ నామ సంవత్సరంలో ఆదాయ-వ్యయాలు మొత్తం పరిశీలిస్తే ఈ రాశులవారు బాగా సంపాదిస్తారు...తక్కువ ఖర్చు చేస్తారు...
వృషభ రాశి
( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు)
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 1
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృషభరాశివారికి ఆదాయం కన్నా ఖర్చులు తక్కువే ఉన్నాయి. గురుడు 12 వ స్థానంలో ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల బలం వల్ల అన్నింటా యోగ్యమైన ఫలితాలు పొందుతారు. శని, రాహువు మంచి స్థానంలో ఉండడం వల్ల అన్నింటా ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.ఆదాయం బావుంటుంది, గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఈ ఏడాది అది నెరవేరుతుంది.
కర్కాటక రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం : 11 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో కర్కాటక రాశివారికి ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే ఎంతో కొంత జాగ్రత్త చేయడంలో ఈ ఏడాది సక్సెస్ అవుతారు. పైగా అష్టమ శని ఉన్నప్పటికీ సంపదకు కారకుడైన గురుడు 10వ స్థానంలో సంచరిస్తున్నందున ఆర్థికంగా పుంజుకుంటారు కానీ మానసిక బాధలుంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవారికి ఈ ఏడాది అడుగు ముందుకు పడుతుంది.
Also Read: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ
సింహ రాశి
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం:1 అవమానం : 7
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో సింహరాశివారి ఆదాయం ఎక్కడో ఉన్న..ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయి. సంపదకు కారకుడైన గురుడు బలంగా ఉండడం వల్ల భారీగా సంపాదిస్తారు..ఖర్చులు తక్కువే పెడతారు. కానీ ఏడాది ద్వితీయార్థంలో రాహువు అష్టమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులుంటాయి. భారీగా సంపాదిస్తారు..తక్కువ ఖర్చు చేసినప్పటికీ మిగిలిన ధనం చేతిలో నిలవడం కష్టమే..
తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం:7 అవమానం : 7
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో తులారాశివారి ఆదాయం ఎక్కువగా ఉంది. అంటే సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. కష్టపడి సంపాదిస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప తులా రాశివారికి యోగకాలమనే చెప్పాలి.
మకర రాశి
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6
శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మకర రాశివారు పదకొండు వంతులు సంపాదిస్తే అందులో ఐదొంతులు మాత్రమే ఖర్చు చేస్తారు... అంటే.. సగానికి సగం దాచేస్తారు లేదంటే స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. గురుబలం బావున్నందున ఆదాయానికి అస్సలు లోటుండదు. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆర్థిక పరిస్థితి మాత్రం అద్భుతం.
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశివారు కూడా సంపాదించిన దాంట్లో సగం మాత్రమే ఖర్చుచేస్తారు. వీరికి కూడా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ గురుబలం ఉపశమనం ఇస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటా-బయటా అవమానాలు తప్పవు, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు కానీ ధైర్యంగా అడుగేస్తారు. కష్టపడి సంపాదిస్తారు...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)