అన్వేషించండి

Today Horoscope In Telugu: జూలై 26 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు సవాళ్లు తప్పవు..ఉద్యోగంలో మార్పులొచ్చే అవకాశం!

Horoscope Prediction 26th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 26th 2024

మేష రాశి
 
మీ స్వార్థం కోసం ఇతరులకు హాని చేయవద్దు. చట్టపరమైన విషయాలు పెండింగ్‌లో ఉండొచ్చు. మీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తారు.  తల్లి ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటాయి. 
 
వృషభ రాశి

వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తారు. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఈ రోజు మంచిరోజు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల పురోగతి చూసి సంతోషిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. 

మిథున రాశి

నూతన లావాదేవీలు జరిపేందుకు ఈ రోజు మంచి రోజు. ప్రభావశీల వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ స్వభావంలో వినయాన్ని పెంచుకోండి. సహోద్యోగులతో తీవ్రమైన విషయాలు చర్చించవద్దు. 

కర్కాటక రాశి
 
ఈ రాశివారు ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగంలో మార్పులు వచ్చే సూచనున్నాయి. మీ మాటతీరు అందర్నీ మెప్పిస్తుంది. ఉన్నత విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. 

Also Read: ఏదైనా పనిపై ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేయండి సక్సెస్ మీ సొంతం అవుతుంది!

సింహ రాశి

మీ పనిలో ఇతరుల జోక్యం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు పాటించడం వల్ల మీలో సానుకూల మార్పులు వస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. గర్వం తగ్గించుకోకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూల సమయం 

కన్యా రాశి

ఈ రోజు మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ పనితీరుని మార్చుకోవాల్సిన సమయం ఇది. కెరీర్ పరంగా అదృష్టవంతులు అవుతారు. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. రహస్య శాస్త్రాల అధ్యయనం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.

తులా రాశి

ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అందుకుంటారు. అనుకోని ప్రయాణం ఒంటరిగా చేయాల్సి రావొచ్చు. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు. 

వృశ్చిక రాశి

ఈ రాశివారు వ్యాపారంలో లాభపడతారు. ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ప్రస్తుతానికి నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది.  అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమికులు సంతోషంగా ఉంటారు

ధనస్సు రాశి

ఈ రాశివారు ఫ్యూచర్ గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థుల మనోధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకునే అవకాశాలు ఉన్నాయి. హోటల్ వ్యాపారస్తుల ఆదాయం పెరగవచ్చు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.   

Also Read: నక్షత్రం మారుతున్న శని..అక్టోబరు నుంచి మూడు నెలల పాటూ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!

మకర రాశి

ఈ రాశివారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలాసాలలో మునిగితేలుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకోని పనులతో రోజంతా బిజీగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. 

కుంభ రాశి

ఈ రాశి ఉద్యోగులు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కార్యాలయంలో పని విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.  

Also Read: శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ పూలతో పూజచేస్తే సిరిసంపదలు నిలుస్తాయి!

మీన రాశి

ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. నూతన ఆదాయవనరులు ఏర్పడతాయి. ఉద్యోగం, వ్యాపారంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగాల్లో స్థిరపడతారు. సామాజిక సేవ చేయడంపై ఆసక్తి కలిగి ఉంటారు. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget