అన్వేషించండి

Today Horoscope In Telugu: జులై 16 రాశి ఫలితాలు - ఈ రాశుల వారికి ఈ రోజు అనుకోని ఆదాయ సూచనలున్నాయి!

Horoscope Prediction 16th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 16th 2024

మేషం

ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో విపరీతమైన పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం.  

వృషభం

ఈ రాశి వారికి ఈరోజు  ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్థి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు.

మిథునం

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలు అంతంతమాత్రంగానే సాగుతాయి.

కర్కాటకం

ఈ రాశి వారు ఈరోజు దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా  మెరుగైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.

కన్య

ఈరోజు ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు శ్రమతో కాని పూర్తి కావు. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మిన వారే మోసగిస్తారు.

తుల

ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలలో కొత్త  లాభాలు వస్తాయి. సోదరులతో ఉన్న దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు  దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయం వస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు

ఈ రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు.

మకరం

ఈ రాశి వారికి  ఈరోజు బంధు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్య  సమస్యలు మరింత బాధపెడతాయి. చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.

కుంభం

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం కావు.

మీనం

ఈరాశి వారికి  ఈరోజు ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: పూరీ ఆలయంలోని రత్న భాండాగారం మిస్టరీ ఏమిటీ? లోగుట్టు దేవుడికి తప్ప ఎవరికీ తెలియదా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియోKaloji Kalakshetram in Warangal | ఠీవీగా కాళోజీ కళాక్షేత్రంPushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Embed widget