Horoscope Telugu 15th November 2023: ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!
Today Rasi Phalalu in Telugu: దిన ఫలాలు నవంబర్ 15, 2023: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today Telugu 15th November (దిన ఫలాలు నవంబర్ 15, 2023)
మేష రాశి (Aries Horoscope in Telugu)
మీ సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంభాషణలో ఓపికగా ఉండండి. పూర్వీకుల ఆస్తి డబ్బు సంపాదించే సాధనంగా మారుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. విద్యా ప్రయోజనాల కోసం విదేశీ పర్యటనకు వెళ్లవలసి రావచ్చు. ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
వృషభ రాశి (Taurus Horoscope in Telugu)
మనసులో నిరాశ, అసంతృప్తి ఉండవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. కుటుంబం పట్ల సరైన శ్రద్ధ వహించండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విద్యా పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు.
Also Read: సోదరుడి క్షేమాన్ని కోరుకునే వేడుక భగినీ హస్త భోజనం (నవంబరు 15) , ఈ రోజు ఏం చేయాలంటే!
మిథున రాశి (Gemini Horoscope in Telugu)
మానసిక ప్రశాంతత ఉంటుంది, కానీ అనవసర ఆందోళనలు కూడా ఉంటాయి. అనవసరమైన కోపం , చర్చలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతలు పొందుతారు. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. స్వీయ నియంత్రణలో ఉండండి. అతిగా ఉత్సాహంగా ఉండటం మానుకోండి. సోదరులతో విభేదాలు రావచ్చు.
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)
ఈ రాశివారు అధిక కోపం తగ్గించుకోవాలి. సంభాషణలో ఓపికగా ఉండండి. ఉద్యోగంలో అధికారులతో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని అదనపు బాధ్యతలను పొందవచ్చు. సంభాషణలో సమతుల్యతను కాపాడుకోండి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
సింహ రాశి ( Leo Horoscope in Telugu)
కొన్ని ఒడిదొడుకులు ఉండవచ్చు. చేపట్టే పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంభాషణలో ఓపికగా ఉండండి. వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. డబ్బు కొరత ఉండవచ్చు.
Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!
కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
ఈ రాశి ఉద్యోగులు మార్పు కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వ్యాపారం విస్తరించే ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. విద్యా , మేధోపరమైన పని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. ఉన్నత విద్య కోసం పెట్టుబడి పెడతారు.
తులా రాశి (Libra Horoscope in Telugu)
ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. వ్యాపారంలో లాభాలొస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగతుంది. ఉద్యోగులుకు అధికారులతో విభేదాలు రావచ్చు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
ఈ రాశివారి మనసులో ఏదో నిరాశ, అసంతృప్తి ఉంటుంది. మీ మాటల ప్రభావం పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. చదువులపై ఆసక్తి ఉంటుంది.రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు, కానీ అతిగా ఉత్సాహంగా ఉండకండి. కోపం తగ్గించుకోవడం మంచిది.
ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
ఈ రాశివారు సహనంగా ఉండాల్సిన సమయం ఇది. వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. అనవసర తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. పురోగతికి అవకాశాలు ఉంటాయి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు, కానీ మీరు కొన్ని ప్రత్యేక ప్రయోజనం కోసం వేరే ప్రదేశానికి వెళ్లవలసి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసులో ప్రశాంతత, సంతోషం కలుగుతాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది.
Also Read: కార్తీకమాసంలో రోజూ తలకు స్నానం చేయాలా!
మకర రాశి (Capricorn Horoscope in Telugu)
ఈ రాశివారు సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. పాత స్నేహితులను కలుస్తారు. ఆస్తులు కలిసొస్తాయి. ఉద్యోగంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడతారు. మీరు కార్యాలయంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న కొంత డబ్బు తిరిగి రావచ్చు. సహనం లోపిస్తుంది కానీ కుటుంబం నుంచి మద్దతు ఉంటుంది. కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఈ రాశివారి ఆలోచనల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. తీపి ఆహారం పట్ల ఆశక్తి పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారం విస్తరించాలి అనుకునే ప్రణాళికలు అమలు చేస్తారు. పిల్లల కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.