అన్వేషించండి

Horoscope Telugu 14th November 2023: ఈ రోజు ఈ రాశులవారిపై హనుమాన్ అనుగ్రహం ఉంటుంది. నవంబరు 14 రాశిఫలాలు

Today Rasi Phalalu in Telugu: దిన ఫలాలు నవంబర్ 14, 2023: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today Telugu 14th November (దిన ఫలాలు నవంబర్ 14, 2023)

మేష రాశి (Aries Horoscope in Telugu)

ఈ రాశివారికి పెద్దల ఆశీస్సులుంటాయి. వ్యాపార కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు స్నేహితుడి నుంచి మద్దతు పొందవచ్చు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కళ లేదా సంగీతం వైపు ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ ఉంటుంది. కోపం కాసేపే ఉంటుంది . వారసత్వ ఆస్తిని పొందుతారు. విద్యార్థులు చదువుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 

వృషభ రాశి  (Taurus Horoscope in Telugu)

ఈ రోజు మీకు కొంత గందరగోళంగా అనిపిస్తుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. విద్యార్థుల దృష్టి చదువుపై మాత్రమే ఉండాలి. మితిమీరిన కోపం ఆవేశం పనికిరాదని గుర్తుంచుకోండి. తల్లిదండ్రులతో విభేదాలు ఉండొచ్చు. సహనంగా ఉండేందుకు ప్రయత్నించాలి. 

మిథున రాశి (Gemini Horoscope in Telugu)

ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది అదే సమయంలో అనవసర ఆందోళనలు ఉంటాయి. చర్చలకు దూరంగా ఉండడం మంచిది. మీరు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. ఏ విషయంలోనీ అత్సుత్సాహం ప్రదర్శించవద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలున్నాయి. సోదరులతో విభేదాలు రావచ్చు. తీపి ఆహారం పట్ల ఆసక్తి ఉంటుంది. 

Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!

కర్కాటక రాశి  (Cancer Horoscope in Telugu)

మనసులో ఆశ, నిస్పృహలు ఉండవచ్చు. మతం పట్ల భక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకో విద్యార్థులు విజయం సాధిస్తారు.  మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతను పొందవచ్చు. మీరు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. సంభాషణలో సంయమనం పాటించండి. పనిభారం పెరగవచ్చు. లాభదాయకమైన కొత్త అవకాశాలు ఉంటాయి.

సింహ రాశి ( Leo Horoscope in Telugu)

స్వీయ నియంత్రణలో ఉండండి. కోపం తగ్గించుకోవాలి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. పూర్వీకుల వ్యాపారాన్ని పునఃప్రారంభించవచ్చు. ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. తండ్రి సాంగత్యం లభిస్తుంది. ధార్మిక ప్రదేశానికి విహారయాత్రను ప్లాన్ చేయవచ్చు.  కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. 

కన్యా రాశి (Virgo Horoscope in Telugu)

మీ మాట ప్రభావం పెరుగుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వేరే ప్రదేశానికి వెళ్ళవచ్చు. సహనం తగ్గుతుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళ , సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యక్షేత్రంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

తులా రాశి (Libra Horoscope in Telugu)

ఈ రాశివారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు కానీ స్వీయ నియంత్రణలో ఉంటారు. నిర్మాణ సౌఖ్యం పెరుగుతుంది. మీరు స్నేహితుడి నుంచి  డబ్బు పొందవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి దారులు సుగమం అవుతాయి. కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అతిగా ఉత్సాహంగా ఉండటం మానుకోండి. కుటుంబంలో విభేదాలు పరిష్కరించుకోవాలి.

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)

మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుడి నుండి కొత్త వ్యాపారం కోసం ప్రతిపాదనను పొందవచ్చు. ఆర్థికంగా లాభపడొచ్చు. చదువులపై ఆసక్తి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీరు తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. మీకు శుభవార్త అందుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)

ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి.  వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. సోదరులు, సోదరీమణుల నుంచి మద్దతు పొందుతారు. ఖర్చులు ఎక్కువవుతాయి. గౌరవం పెరుగుతుంది. 

Also Read: కార్తీకమాసం వచ్చేస్తోంది - నెలంతా తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!

మకర రాశి (Capricorn Horoscope in Telugu)

పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదం తలెత్తవచ్చు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జీవితంలో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. భవనాల అలంకరణకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రచన , మేధో పని అర్ధవంతమైన ఫలితాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు.

కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)

ఈ రాశివారి మనస్సు కలత చెందుతుంది. ఓపికపట్టండి. అధిక కోపాన్ని నివారించండి. సంభాషణలో ఓపికగా ఉండండి. మీరు మీ ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గుతుంది. ఇంటా బయటా గౌరవం పొందుతారు. స్నహితుల సహకారం లభిస్తుంది. 

మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఈ రాశివారి మాటలో సౌమ్యత ఉంటుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. పని పరిధిలో మార్పులు ఉండొచ్చు. శ్రమ పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వాహన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP DesamCM Chandrababu on Population | పెద్ద కుటుంబమే పద్ధతైన కుటుంబం | ABP DesamMohammed shami Jasprit Bumrah CT 2025 | నిప్పులాంటి బుమ్రా...పెను తుపాన్ షమీ తోడవుతున్నాడు | ABP DesamTeam India Squad Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Delhi Assembly Election 2025:అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Embed widget