Shani Margi 2025: ఈ రాశులపై శని అనుగ్రహం.. ఉద్యోగం, ధన లాభం.. మీ రాశి ఉందా?
Shani Margi 2025: నవంబర్ 28న శని దేవుడు తిరోగమనం నుంచి సాధారణ మార్గంలోకి వస్తున్నాడు. కర్కాటకంతో సహా ఈ మూడు రాశుల వారికి అదృష్టం వరిస్తుంది.

Shani Margi 2025: శని తిరోగమనం నుంచి నేరుగా సంచరించడం ప్రారంభించాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఇది ముఖ్యమైనదిగా చూస్తారు. శని వక్రం నుంచి సాధారణ స్థితికి రావడం అనే ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారిపై ప్రతికూల, మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయితే మీనంలో సంచరిస్తున్న శని..వక్రం నుంచి సాధారణ స్థితికి రావడం ఈ రాశులవారికి అత్యంత లాభదాయకం.
కర్కాటక రాశి [Cancer Horoscope]
కర్కాటక రాశి వారికి శని సాధారణ సంచారం ఫలవంతంగా ఉండబోతోంది. దీనివల్ల ఉద్యోగం లేదా కార్యాలయంలో పురోగతి లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. అదే సమయంలో పాత పెట్టుబడుల నుంచి లాభం లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. కార్యాలయంలో మీ గురించి ప్రశంసలు ఉండవచ్చు. పాత వివాదాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
వృశ్చిక రాశి [Scorpio Horoscope]
శని ప్రస్తుతం వృశ్చిక రాశిలో వెండి పాదంతో నడుస్తున్నాడు, నవంబర్ 28న సాధారణ స్థితికిరాగానే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తుంది. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేస్తుంది. దీని తరువాత, మీ పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలి అనుకుంటే ఇదే సరైన సమయం కావొచ్చు
కుంభ రాశి [Aquarius Horoscope]
కుంభ రాశిపై కూడా శని ప్రభావం అనుకూలంగానే ఉంది. శని వక్రం నుంచి సాధారణ స్థితికి రావడం మీకు మంచి జరుగుతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది . ధన వృద్ధికి అవకాశాలు ఏర్పడతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు
శని వెండిపాదం అని ఎలా నిర్ణయిస్తారు?
శని దేవుని గోచారం సమయంలో చంద్రుడు శనితి సంబంధించిన 2, 5 లేదా 9వ ఇంట్లో ఉన్నప్పుడు... శని వెండి పాదంతో నడుస్తున్నాడని చెబుతారు. శని 29 మార్చి 2025న మీన రాశిలోకి ప్రవేశించాడు..అప్పటి నుంచి కర్కాటక, వృశ్చికం, కుంభ రాశి శని వెండి పాదంపైకి వచ్చాయి.
నెమ్మదిగా సంచరిస్తాడు కనుకే..శనిని మందరుడు అని పిలుస్తారు. ప్రతి గ్రహం నెల రోజులకు రాశి మారితే బృహస్పతి ఏడాదికి ఓసారి రాశి పరివర్తనం చెందుతాడు. శని మాత్రం రెండున్నరేళ్లకు ఓ రాశి నుంచి మరో రాశికి మారుతాడు. అంటే ఒక్కో రాశిలో శని సంచారం రెండున్న సంవత్సరాలు. అలా ఏ రాశిలో శని సంచారం ఉంటే వారికి, ఆ ముందు రాశికి, తర్వాత రాశికి ఏల్నాటి శని ఉన్నట్టు. ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తున్నాడు... అంటే మీనం వారితో పాటూ కుంభం, మేషం వారికి కూడా ఏల్నాటి శని ఉంటుంది. మీ రాశి నుంచి శని నాలుగో స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని అని...ఎనిమిదో స్థానంలో ఉంటే అష్టమ శని అని అంటారు. కొందరికి శని యోగకారకుడు అవుతాడు..మరికొందరికి ఉద్యోగం, ఆరోగ్యం,కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతాడు. ఈ ఫలితం పూర్తిగా మీరు ఆచరించే కర్మలపై ఆధారపడి ఉంటుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















