Rasi Phalalu Today July 31st : జూలై 31 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారికి ఆర్థిక లాభం, నూతన ఆస్తులు కొనుగోలు ప్రయత్నం!
Horoscope Prediction 31st July 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for july 31st 2024
మేష రాశి
ఈ రోజు ఆర్థిక లాభం ఉంటుంది. భవిష్యత్తు గురించి చాలా స్పృహతో ఉంటారు. సాయంత్రం కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. ఖర్చుల కారణంగా వైవాహిక సంబంధాలలో కొంత విభేదాలు ఉండవచ్చు.
వృషభ రాశి
ఈ రోజు ఉద్యోగాలు చేసేవారి ఆదాయం పెరుగుతుంది. బోధనతో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు చాలా మంచిది. మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవద్దు. మీ మాటలపై అభ్యంతరాలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల విషయంలో సమస్యలు ఉంటాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది
Also Read: మనసులో కోర్కెలు తీర్చే కామిక ఏకాదశి ( జూలై 31) - తులసి ఆకులతో ఇలా చేయండి!
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఉన్నతాధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మంచి ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. వైవాహిక జీవితం బాగానే సాగుతుంది.
సింహ రాశి
ఈ రాశివారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఎగుమతి-దిగుమతుల నుంచి లాభం పొందుతారు. ఉద్యోగంలో మీ ఆదాయం పెరుగుతుంది. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలు ఆర్థిక ప్రయోజనాలను తెస్తాయి. మతపరమైన యాత్రను ప్లాన్ చేసుకుంటారు. మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు
కన్యా రాశి
ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువులో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు తీరిపోతాయి. డబ్బు లేకపోవడం వల్ల ముఖ్యమైన పనులు ఆగిపోవచ్చు.
తులా రాశి
మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చిక రాశి
అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యాల నిర్వహణలకు ప్లాన్ చేసుకుంటారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు. వైవాహిక బంధం బావుంటుంది. కుటుంబం నుంచి మంచి సహకారం అందుకుంటారు.
Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!
ధనుస్సు రాశి
ఈ రోజు స్నేహితులను కలుస్తారు. మీ పట్ల ఉన్నతాధికారులు సంతృప్తిగా ఉంటారు. పిల్లల సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారం కోసం అప్పులు చేయాల్సి రావొచ్చు.
మకర రాశి
ఈరోజు చేసే పనిని రేపటికి వాయిదా వేయకండి. స్నేహితులతో ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. నూతన విషయాలు తెలుసుకుంటారు. పిల్లల విషయంలో ఒత్తిడి దూరమవుతుంది. మీరు ఉన్నత విద్యలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు
కుంభ రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో , కార్యాలయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి అవసరాల భారం మీపై ఉంటుంది. కెరీర్‌కు సంబంధించి రోజు చాలా బాగుంటుంది. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో జాగ్రత్తగా ఉండండి.
Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!
మీన రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీ విషయంలో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.