అన్వేషించండి

Rasi Phalalu Today 14th May 2025: ఈ రాశులవారికి మంచిరోజులు మొదలయ్యాయి - మేషం to మీనం మే 14 రాశిఫలాలు!

Rasi Phalalu Today in Telugu : మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మే 14 రాశిఫలాలు

మేష రాశి (Aries) - 2025 మే 14

ఈ రోజు మీకు ఒత్తిడితో కూడుకున్న రోజుగా ఉంటుంది. గృహ జీవితంలో భాగస్వామితో ఏదైనా విషయంపై గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ మాటపై మీరు నియంత్రణను కొనసాగించండి లేకపోతే సమస్యలు వస్తాయి. విద్యార్థులకు చదువుపై దృష్టి సారించాలి.  స్నేహితుడి ఆరోగ్యం గురించి  ఆందోళన చెందుతారు. ఏదైనా పనిలో నష్టపోయే అవకాశం ఉంది.. న్యాయ వ్యవహారంలో ఆస్తి కలిసొస్తుంది.

వృషభ రాశి (Taurus) - 2025 మే 14

ఈ రోజంతా బిజీగా ఉంటారు. మీ పనులను రేపటికి వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు..ఇది మీకు సమస్యలు కలిగిస్తుంది. ప్రేమ జీవితం గడుపుతున్న వారు ఈ రోజు సమన్వయంతో ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారు పార్ట్ టైమ్ పని చేయాలని ప్లాన్ చేస్తే అది సులభంగా చేయవచ్చు. మీ పనుల గురించి కొంత అసౌకర్యంగా ఉంటారు.
 
మిథున రాశి (Gemini) - 2025 మే 14

ఈ రోజు మీ జ్ఞానాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించండి. కుటుంబ విషయాలను కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. ఇంట్లో గొడవల వల్ల మీకు ఒత్తిడి ఉంటుంది. అన్నదమ్ములకు శారీరక ఇబ్బందులు ఎదురవడం వల్ల ఆందోళన చెందుతారు. ఏదో ఒక విషయం గురించి మీకు గందరగోళం ఉంటుంది. కెరీర్ పరంగా చాలాకాలంగా ఆగిపోయిన పనులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ వ్యాపార ప్రణాళికల గురించి అనుభవజ్ఞులతో చర్చిస్తారు. 

కర్కాటక రాశి (Cancer) - 2025 మే 14

ఈ రోజు ఏ పనినైనా తొందరపడి చేయొద్దు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ధార్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఎవరినీ అడిగి వాహనం నడపకండి.  మీ పనులను పూర్తి చేయడంలో మీ సోదరుల సహాయం తీసుకోవచ్చు. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఇప్పటికే మీరు  షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టి ఉంటే అందులో నష్టం వచ్చే అవకాశం ఉంది.

సింహ రాశి (Leo) - 2025 మే 14

ఈ రోజు ఆర్థిక విషయాలు కలిసొస్తాయి.   బంధువు నుంచి శుభవార్త వినవచ్చు. వైవాహిక జీవితంలో చిన్నసమస్యలు ఉంటాయి.. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాలను బయటకు చెప్పొద్దు. వ్యాపారంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉంది.

కన్యా రాశి (Virgo) - 2025 మే 14

ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది.  చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్య ముగిసిపోతుంది.  పాత స్నేహితుడిని చాలా కాలం తర్వాత కలుస్తారు. ఓశుభవార్త వింటారు. విద్యార్థులకు చదువు గురించి ఆందోళన ఉంటే అది తొలగిపోతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీ పనుల గురించి జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి (Libra) - 2025 మే 14

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది.  నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. సంతానం వైపునుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్న వారు దానిలో మార్పులు చేయాలని ప్లాన్ చేస్తారు. మీరు పని ప్రదేశంలో జట్టు పని ద్వారా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది.

వృశ్చిక రాశి (Scorpio) - 2025 మే 14

ఈ రోజు వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మీరు శుభకార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
ఆస్తిలో పెట్టుబడి పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి లేదంటే డబ్బులు తప్పుడు పనుల్లో ఇరుక్కుపోతాయి. మీ కుటుంబంలోని పెద్దల మాటలకు విలువ ఇవ్వాలి. గొడవలు జరిగే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి (Sagittarius) - 2025 మే 14

ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యానని నిర్లక్ష్యం చేస్తే మీ సమస్యలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాల పట్ల మీ విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సమస్యలను కలిసి కూర్చుని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారులు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. 

మకర రాశి (Capricorn) - 2025 మే 14

ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. మీ పనులతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వాలి. మీ మాటలు, ప్రవర్తనపై నియంత్రణ ఉంచుకోవాలి. ఏదైనా పనిని ప్లాన్ చేసుకుని ముందుకు సాగాలి. పని ప్రదేశంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల మీకు కొంత ఆందోళన ఉంటుంది.
 
కుంభ రాశి (Aquarius) - 2025 మే 14

ఈ రోజు ఖర్చుతో కూడుకున్న రోజు అవుతుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. మీ తప్పు కుటుంబ సభ్యుల ముందు బయటపడవచ్చు. ఉద్యోగులకు పనిభారం అధికంగా ఉంటుంది. మీ పనులపై పూర్తి దృష్టి పెట్టాలి. అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాను పాటించడం మంచిది.

మీన రాశి (Pisces) - 2025 మే 14

ఈ రోజు మీనరాశివారికి జీవిత భాగస్వామితో ఏదైనా విషయంపై అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. మీరు ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే, అది సులభంగా లభిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి మంచిగా ఉంటుంది.  కానీ కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ మీ తెలివితేటలతో వారిపై పైచేయి సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌

వీడియోలు

North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
HYD Lover Death: ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
ప్రేమిస్తే.. చంపేస్తారా? కుమార్తె ప్రేమికుడిని దారుణంగా హతమార్చిన తల్లిదండ్రులు!
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
The Raja Saab Bookings: రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
రాజా సాబ్ ప్లానింగ్ అదుర్స్... అమెరికాలో నెల ముందు!
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
CBSE Board Exam 2026: సిబిఎస్ఇ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! పరీక్ష రూల్స్‌లో భారీ మార్పులు!
సిబిఎస్ఇ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! పరీక్ష రూల్స్‌లో భారీ మార్పులు!
Embed widget