2024 Horoscope Today 07 Augsut: ఆగష్టు 07 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు ఆస్తివివాదాల నుంచి బయటపడి ఆర్థికంగా లాభపడతారు!
Horoscope Prediction 7 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
![2024 Horoscope Today 07 Augsut: ఆగష్టు 07 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు ఆస్తివివాదాల నుంచి బయటపడి ఆర్థికంగా లాభపడతారు! rasi phalalu today 07 August 2024 rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope 2024 Horoscope Today 07 Augsut: ఆగష్టు 07 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈ రోజు ఆస్తివివాదాల నుంచి బయటపడి ఆర్థికంగా లాభపడతారు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/ba42cd06792651a2d650311bf4f459b81722939259134217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Daily Horoscope for 7 August 2024
మేష రాశి
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు తొలగిపోతాయి. ఆన్‌లైన్ వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు.
వృషభ రాశి
పరిశోధన రంగంలో ఉండేవారు విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలకు సంబంధించి మీ ఆలోచనలను సన్నిహితులతో పంచుకుంటారు. ఒకేసారి అనేక పనులు చేయాలనే ఆలోచన చేయవద్దు. ఆరోగ్యం జాగ్రత్త..
మిథున రాశి
మీ సంపదలో పెరుగుదల ఉంటుంది. మీ లక్ష్యాల పట్ల స్ట్రాంగ్ గా ఉంటారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. భౌతిక సుఖాలను అనుభవిస్తారు.
కర్కాటక రాశి
మీ స్వార్థపూరిత వైఖరి కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. ఇంట్లో, కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. గుండె సంబంధిత రోగులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అధిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది.
Also Read: శని, శుక్ర సంసప్తక యోగం - ఆగష్టు 25 వరకూ ఈ రాశులవారి జీవితంలో అన్నీ అద్భుతాలే!
సింహ రాశి
ఈ రాశివారికి కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
కన్యా రాశి
భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటారు. సహోద్యోగులతో అనవసర చర్చలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అనుకున్న సమయానికి పని పూర్తి చేయలేరు. ఎవరికైనా సహాయం చేసేందుకు ధనం వెచ్చిస్తారు.
తులా రాశి
ఈ రోజు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తుపై కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. చట్టపరమైన వివాదాల్లో చిక్కుకుని ఉంటే ఈ రోజు బయటపడతారు. కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవాలనే ఆలోచన చేస్తారు. తల్లిదండ్రుల సలహాలు పాటించడం మంచిది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. స్నేహితులు లేదా బంధువులకు సహాయం చేయాల్సి రావొచ్చు.
Also Read: 2024 శ్రావణమాసంలో శుభముహూర్తాలివే.. ఇప్పుడు కూడా టైమ్ తక్కువే ఉంది త్వరపడండి!
మకర రాశి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యమైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. పెండింగ్ పనుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అనవసరమైన తగాదాల వల్ల మీ ప్రవర్తనపై మచ్చ పడుతుంది.
కుంభ రాశి
ఈ రోజు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు
మీన రాశి
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తుల కీర్తి పెరుగుతుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడేవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు.
Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)