Numerology Predictions 18th October 2022: ఈ తేదీల్లో పుట్టినవారు అజాగ్రత్తను తగ్గించుకోండి, అక్టోబరు 18 న్యూమరాలజీ
Numerology prediction 18st October 2022 : సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈరోజు( అక్టోబరు 18) ఎవరెవరికి కలిసొస్తుంది? న్యూమరాలజీ నిపుణులు ఏం చెప్పారో..ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
Numerology prediction 18th October 2022 : న్యూమరాలజీ ప్రకారం అక్టోబరు 18 మంగళవారం రోజు....ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు ఖర్చులు ఎక్కువ చేస్తారు..ఆదాయం కూడా అలాగే వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సామాజిక కార్యక్రమాల్లో కొంత సమయం గడుపుతారు. ప్రభావవంతమైన వ్యక్తి సహకారం మీకు వ్యాపారానికి సంబంధించిన కొత్త విజయాన్ని అందిస్తుంది.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ తేదీల్లో పుట్టినవారు స్నేహితుల నుంచి సహకారం పొందుతారు. మీ వ్యక్తిత్వంలో కొంత మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. చిన్నపాటి అజాగ్రత్త వల్ల మోసపోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు ముఖ్యమైన సమస్యలను ఒక వ్యక్తితో చర్చించవచ్చు. మీరు మీ లక్షణాలను సానుకూలంగా ఉపయోగిస్తే, మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక యోగం ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది.వినోద కార్యక్రమాలలో సమయం గడుపుతారు.
Also Read: ఈ వారం ఈ రాశివారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
స్నేహితులు, బంధువుల నుంచి సహకారం అందుకుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. కోపాన్ని అదుపుచేసుకోండి. ఉద్యోగులు కార్యాలయంలో ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు.
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈ తేదీల్లో పుట్టినవారు చాలా వరకూ పనిని తనంతట తానుగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ ప్రవర్తన పట్ల ఆకర్షితులవుతారు. పనిలో ఆటంకం కారణంగా కొంత సమయం వృధా కావొచ్చు. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించే అవకాశం ఉంది.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
అనుకున్న అన్ని పనులు సరిగ్గా పూర్తవుతాయి. ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. ఇరుగు పొరుగు వారితో స్నేహం మెరుగుపడుతుంది. వైవాహిక సంబంధాలలో విడిపోయే పరిస్థితి రావొచ్చు జాగ్రత్త. ఆదాయ మార్గాలలో తగ్గుదల ఉంటుంది. వాతావరణం కారణంగా ఆరోగ్యం క్షీణించవచ్చు.
Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీలలో పుట్టినవారు భవిష్యత్ గురించి ఆలోచించడం మొదలెడతారు. ఎలా జీవించాలో కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు. కార్యాలయంలో బిజీగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవుకానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులను కలుస్తారు, ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో పుట్టినవారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. కుటుంబ జీవితంలో ఒత్తిడి ఉండవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. పిల్లలతో సరదాగా గడపండి. ప్రయాణం చేసేందుకు ప్లాన్స్ వేసుకునేందుకు ఇదే మంచిసమయం.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆస్తి కొనుగోలుకు సంబంధించి ప్రణాళిక ఉంటుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.