చాణక్య నీతి: ఆ విషయాల్లో మగవారి కన్నా ఆడవారిదే పైచేయి
దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు… జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.
ఆడవారి, మగవారికి సంబంధించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటాయి. ముఖ్యమైన కొన్ని విషయాల్లో పురుషుల కన్నా మహిళలే ముందుంటారని చెప్పాడు కౌటిల్యుడు.
తెలివి మహిళలకు మగవారి కన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అందుకే వారు ఎలాంటి కష్టమైన పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలుగుతారు.
ధైర్యం ధైర్యంలో కూడా పురుషులపై మహిళలదే పైచేయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అస్సలు భయపడరు. కౌటిల్యుడి చెప్పిన మాటల ప్రకారం మగవారి కన్నా మగువలకు ఆరురెట్లు ధైర్యం ఎక్కువ ఉంటుందట.
ఆకలి సాధారణంగా ఆడవారి కన్నా మగవారు ఎక్కువ తింటారని అనుకుంటాం . కానీ కౌటిల్యుడి ప్రకారం మగవారి కన్నా మహిళలే ఎక్కువ తింటారట. అంతేకాదు వారికి త్వరగా ఆకలి అవుతుందట.
పొదుపు చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ దగ్గరనుంచి…పోపుల పెట్టె వరకూ…పొదుపు విషయంలో మహిళల్ని అస్సలు దాటలేరట మగవారు. షాపింగుల పేరుతో ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారని అనుకుంటా కానీ… పొదుపు విషయంలోనూ అంతకు మించి అనేలా ఉంటారట.
లైంగిక వాంఛ సాధారణంగా శృంగారాన్ని పురుషులతో ముడిపెట్టి చూస్తారు కానీ మగవారితో పోలిస్తే మగువల్లో లైంగిక వాంఛ ఎనిమిది రెట్లు ఎక్కువని చెప్పాడు చాణక్యుడు. అందుకే మగవారు సంతృప్తి పొందినంత త్వరగా మహిళల్లో ఆ ఫీలింగ్ కనిపించదంటారు.
ఇదే విషయాన్ని వైద్యశాస్త్ర నిపుణులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. చాలా అధ్యయనాల్లో ఈ విషయాల్లో అమ్మాయిలదే పైచేయి అని తేలింది.
సిగ్గు విషయానికొస్తే మగవారి కన్నా మహిళల్లో నాలుగురెట్లు ఎక్కవ సిగ్గుపడతారని స్పష్టం చేశాడు కౌటిల్యుడు.