2026 Numerology Predictions: న్యూమరాలజీ ప్రకారం మీది నంబర్ 1 అయితే 2026లో మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా?
Numerology 2026: ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28 తేదీల్లో మీరు జన్మిస్తే...న్యూమరాలజీ ప్రకారం మీది నంబర్ 1 అయితే .. 2026 సంవత్సరం ఎలా ఉంటుందో, జ్యోతిష్య శాస్త్ర పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి

2026 Numerology Predictions: 2025 పూర్తవుతోంది... 2026 వచ్చేందుకు కొన్ని రోజులే సమయం ఉంది. అయితే కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు , జీవితంలో మంచి మార్పుల కోసం కొత్త దిశను తెస్తుందనే నమ్మకంతో ఉంటారు. 2026 సంవత్సరం రావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం, 2026 సంవత్సరం మొత్తం (2+0+2+6=1) అవుతుంది. మరి న్యూమరాలజీ ప్రకారం 1 ఉన్నవారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం?
ఏ నెలలోనైనా 1, 10, 19 లేదా 28 తేదీల్లో జన్మించిన వారి నంబర్ 1 అవుతుంది
జ్యోతిష్య శాస్త్ర పండితులు..నీతికా శర్మ ప్రకారం
న్యూమరాలజీ ప్రకారం మీది నంబర్1 అయితే వారికి 2026 సంవత్సరం శక్తితో నిండి ఉంటుంది. మీపై సూర్యుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. 2026 సంవత్సరం మీకు వ్యక్తిగత వృద్ధికి సంబంధించిన సంవత్సరంగా ఉండవచ్చు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 ఉన్నవారు..
2026 సంవత్సరం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, ఉద్యోగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించేందుకు శుభ సమయం. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కొత్త ఏడాదిలో పూర్తవుతాయి. దీనితో పాటు వృత్తిపరమైన వృద్ధితో పాటు, కొత్త ఉద్యోగాలు, పదోన్నతుల అవకాశాలు కూడా ఉన్నాయి.
కెరీర్ పరంగా మీకు కొన్ని సూచనలు ఇవే!
కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారితో అహంకారానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
కెరీర్‌లో ఉద్యోగ మార్పు అవకాశాలు లభిస్తాయి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు.
మీ నైపుణ్యాలపై పని చేయండి.. వ్యక్తిగత వృద్ధి కెరీర్‌లో ప్రయోజనం చేకూరుస్తుంది.
ఆర్థిక సూచన
2026 సంవత్సరం ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి, కానీ పొదుపుపై కూడా దృష్టి పెట్టండి.
అధికంగా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన వదిలేయండి... లేదంటే నిపుణుల సలహాలు స్వీకరించిన తర్వాతే పెట్టుబడులు పెట్టండి
వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సూచన
జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై విభేదాలు ఉండవచ్చు. అయితే సంబంధంలో సామరస్యాన్ని కొనసాగించాలనే ఆలోచన ఉంటే కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్య పరిష్కరించుకోండి. అప్పుడు పెద్ద సమస్య కూడా చిన్నదిగా మారిపోతుంది. పంతానికి పోవద్దు.. కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి
న్యూమరాలజీ ప్రకారం మీది 1 అయితే..2026 సంవత్సరంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న అనారోగ్య సమస్యను తేలిగ్గా తీసుకోవద్దు. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.
ఏడాది మొత్తం రోజూ ఉదయాన్నే సూర్యభగవానుడికి నమస్కరించండి.. ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించండి. దీనితో పాటు, క్రమం తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
'వారణాసి' సినిమా టీజర్లో కనిపించిన 'చినమస్తా దేవి' ఎవరు? రాజమౌళి ఆమె గురించి ఏం చెప్పబోతున్నారు?





















