Numerology prediction September 16: ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది, ఖర్చులు తగ్గించండి
న్యూమరాలజీలో రాడిక్స్ ఆధారంగా ఆ వ్యక్తి స్వభావం, వృత్తి, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పొచ్చు. 1 నుంచి 9 వరకూ రాడిక్స్ ఉన్న వారందరికీ సెప్టెంబరు 16న ఎలా ఉందో చూద్దాం...
Numerology prediction September 16th : న్యూమరాలజీ ప్రకారం సెప్టెంబరు 16 శుక్రవారం ఫలితాలు తెలుసుకుందాం...
రాడిక్స్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19,28)
1,10, 19,28 తేదీల్లో పుట్టిన వారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. మానసికంగా కొంత అశాంతి తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 23.
రాడిక్స్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20, 29)
ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. కొన్ని పనుల కోసం బయటకు వెళ్లాల్సి రావొచ్చు. ఈ అదృష్ట సంఖ్య 23.
Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం
రాడిక్స్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఏ పని చేయాలనుకున్నారో ఆ పనిలో మంచి ఫలితాలు పొందుతారు.ఈ రోజు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. విదేశాలకు వెళ్లాలి అనే ఆలోచన ఉన్నవారికి మంచి అవకాశాలున్నాయి. మీ అదృష్ట సంఖ్య 20.
రాడిక్స్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
లీగల్ వ్యవహారాలు ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేవు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పరిస్థితిని ఒకటికి రెండుసార్లు అంచనా వేసి నిర్ణయం తీసుకోండి. గతంలో కన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 26.
రాడిక్స్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
5, 14, 23 తేదీల్లో పుట్టినవారు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం కారణంగా ఆందోళన పెరుగుతుంది. ప్రభుత్వ పనులు వేగం పుంజుకుంటాయి. అదృష్ట సంఖ్య 22.
రాడిక్స్ 6 (పుట్టిన తేదీలు 6, 14, 24)
మీ మొరటుతనం సమస్యలను సృష్టిస్తుంది. మాట్లాడేటప్పుడు మాట తూలకుండా జాగ్రత్తపడండి. వేరేవారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. సంయమనం పాటించండి. కోపాన్ని అదుపుచేయకుంటే నష్టపోతారు. సాంకేతిక ప్రైవేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు అనుకూలమైన రోజు. అదృష్ట సంఖ్య 11.
రాడిక్స్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
7, 16, 25 తేదీల్లో పుట్టిన వ్యక్తులు..ఈరోజు వాహనాన్నిజాగ్రత్తగా నడపండి. ఈ రోజు అతిథులను కలుస్తారు. మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాభివృద్ధికి అవకాశాలున్నాయి. మీ అదృష్ట సంఖ్య 18.
Also Read: కన్యారాశిలో బుధుడు తిరోగమనం - ఈ 3 రాశులవారూ జాగ్రత్త, ఆ 4 రాశులవారికి అంతా శుభమే
రాడిక్స్ 8 (పుట్టిన తేదీలు 8, 17 మరియు 26)
ఈ రోజంతా మీరు ఎనర్జటిక్ గా ఉంటారు. నూతన పెట్టుబడులకు,స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలమైన రోజు ఇది. ఆస్తికి సంబంధించిన లావాదేవీలు జరుపుతారు. తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 10.
రాడిక్స్ 9 (పుట్టిన తేదీలు 9, 18, 27)
ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. వ్యాపారంలో పెద్ద డీల్ రావచ్చు. వైవాహిక జీవితంలో వివాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త.. మాటతూలి వివాదాన్ని పెంచొద్దు. కొత్తగా ఏ పని తలపెట్టినా పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ప్రారంభించండి. మీ అదృష్ట సంఖ్య 5.
Note: కొన్ని పుస్తకాలు,జ్యోతిష్యులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన ఫలితాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం