Numerology Predictions 31st July 2023: జూలై 31 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారు ఇతరులపై అతిగా ఆధారపడతారు
Numerology prediction 31st July 2023 : జూలై 31 సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.

Astrology Predictions by Numbers
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో జన్మించినవారి ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. దైవభక్తి మెండుగా ఉంటుంది. సంగీతం, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు కలిసొస్తుంది. వ్యాపారులను అదృష్టం వరిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. మీ అదృష్ట సంఖ్య- 21 లక్కీ కలర్- ఆరెంజ్
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
అనవసరమైన ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏ పనిలోనూ తొందరపడకండి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. హ్యాపీ నంబర్-11 హ్యాపీ కలర్- బ్రౌన్
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ రోజు మీరు ఒంటరిగా గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు.మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అంత అనకూలంగా ఉండదు. కొత్త ప్రణాళికలతో పనులు ప్రారంభించవద్దు. శ్రమలో విజయం సాధిస్తారు. కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకోకండి. మీ లక్కీ నంబర్ 19, లక్కీ కలర్ గ్రీన్.
Also Read: ఆగష్టు మొదటివారం ఈ 3 రాశులవారికి లక్కు మామూలుగా లేదు!
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ రోజు మీ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు మీలా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు మంచి సమయం. అయితే అనుభవజ్ఞుడైన వ్యక్తులను సంప్రదించిన తర్వాతే కొత్త పనులు ప్రారంభించండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త..ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట సంఖ్య-23 లక్కీ కలర్- ఎల్లో
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈరోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మనసులో ఆనందం ఉంటుంది. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో విజయం ఉంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.మీ లక్కీ నంబర్-9, కలిసొచ్చే రంగు కుంకుమపువ్వు
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు , విద్యార్థులకు అంత అనుకూల పరిస్థితులున్నాయి. కొత్త సమస్యలు తలెత్తవచ్చు. కార్యాలయంలో ఏదైనా అదనపు బాధ్యతలు మీకు పెరుగుతాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. మీకు కలిసొచ్చే నంబర్ 16, కలిసొచ్చే రంగు - బ్లూ
Also Read: కుక్క ఏడిస్తే అపశకునమా , ఎవరికో మూడినట్టేనా -ఇందులో నిజమెంత!
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెట్టే రోజవుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. ప్రేమికులకు, వివాహితులకు ఈ రోజు మంచి రోజు. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. మీకు కలిసొచ్చే నంబర్ 18, రంగు -గ్రే
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ప్రమాదకర విషయాల్లో నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయండి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఏదో ఒక విషయంలో చీలిక రావచ్చు. మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వాహనాలు , యంత్రాల వినియోగంలో జాగ్రత్త వహించండి. మీకు లక్కీ నంబర్ -6, కలిసొచ్చే రంగు రెడ్.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ రోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది జాగ్రత్త. మాటలను, కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ప్రవర్తనలో సౌమ్యతను కాపాడుకోవాలి. కొత్త ప్రణాళికలు వేసుకోండి కానీ ఈ రోజు అమలుచేయవద్దు. వాహనం జాగ్రత్తగా నడపండి. ఇతరులపై అధికంగా ఆధారపడడం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం తప్పులుచేసే దిశగా నడిపిస్తుంది. మీ అదృష్ట సంఖ్య-29 అదృష్ట రంగు- పింక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

