నేపాల్‌లో రాజకీయ సంక్షోభం కేవలం సామాజిక అసంతృప్తి మాత్రమేనా? అసలు కారణం ఏంటి?
Nepal Gen Z Protest Reason: నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం, ప్రధాని రాజీనామాపై Gen Z నిరసనలు. రాజకీయమా లేక గ్రహాల ప్రభావమా? భవిష్యత్తు కోసం జ్యోతిష్య విశ్లేషణ.

Nepal Gen Z: నేపాల్‌లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం కేవలం సామాజిక అసంతృప్తి మాత్రమే కాదు, గ్రహాల కదలికలతో ముడిపడి ఉన్న ఒక లోతైన సంకేతం కూడా. శని రాహువు మీన రాశిలో ఉండటం అధికారానికి మూలాలను కదిలించగా, బుధుడు కుజుడి సంచారం యువతను వీధుల్లోకి తీసుకువచ్చింది.
ప్రధాని రాజీనామా, సోషల్ మీడియా నిషేధం Gen-Z ఉద్యమం ఈ మార్పు కేవలం ప్రారంభం అని సూచిస్తున్నాయి. గురువు మిథునంలో ఉండటం కొత్త నాయకత్వానికి సంకేతం ఇస్తుంది, కానీ ప్రస్తుతం విభజన విభేదాల పరిస్థితి కూడా మరింత తీవ్రమవుతుంది. జ్యోతిష్య గణన స్పష్టంగా చెబుతోంది, రాబోయే సంవత్సరాల్లో నేపాల్ మరింత పెద్ద మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది.
అధికారం - ప్రజల మధ్య దూరం పెరుగుతుంది!
నేపాల్ ప్రస్తుతం రాజకీయాలు, సమాజం - యువత ఆకాంక్షలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్న ఒక యుగంలో ఉంది. ప్రధాని రాజీనామా, సోషల్ మీడియాపై నిషేధం వీధుల్లో Gen-Z ప్రతిధ్వని చూస్తుంటే అధికారం ప్రజల మధ్య దూరం పెరిగిందని సూచిస్తున్నాయి. ఇదంతా కేవలం రాజకీయ అసంతృప్తి మాత్రమేనా, లేక దీని వెనుక గ్రహాల పాత్ర కూడా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది? జ్యోతిష్య గణన నేపాల్‌లో ఈ గందరగోళం ప్రస్తుతానికి ఆగదని, రాబోయే లోతైన మార్పులకు ఇది ప్రారంభమని సూచిస్తుంది.
నేపాల్ యువత ఉద్యమం ఒక్కసారిగా చెలరేగింది. సోషల్ మీడియాపై విధించిన ఆంక్షలు దీనికి నిప్పు రాజేస్తే, లోపల ఉన్న కోపం చాలా కాలం నాటిది.
శని నెమ్మదిగా అసంతృప్తిని పెంచాడు .. రాహువు ఆజ్యం పోశాడు
నేపో కిడ్స్ అంటే నాయకుల పిల్లల ఆధిపత్యం .. అవినీతి చాలా సంవత్సరాలుగా అణచివేయబడిన అసంతృప్తిని నెమ్మదిగా పెంచింది. రాహువు శని ఒకేసారి మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఇది బ్లాస్ట్ అయింది
జ్యోతిష్య గ్రంథాల ప్రకారం... రాహువు శనితో ఉన్నప్పుడు, అధికారం మూలాలు కదులుతాయని ప్రజల అసంతృప్తి వ్యక్తమవుతుందని చెబుతున్నాయి. అందుకే ప్రధాని ఒక్కసారిగా కుర్చీని వదిలివేయవలసి వచ్చింది తాత్కాలిక ప్రభుత్వం గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.
జ్యోతిష్య దృష్టిలో ఈ మొత్తం సంఘటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం బుధుడు కుజుడి స్థానం. బుధుడు కమ్యూనికేషన్ సమాచార కారకుడు, అయితే కుజుడు శక్తి మరియు పోరాటానికి చిహ్నం. ఇవి రెండూ ఢీకొన్నప్పుడు, ప్రజల సంభాషణ తిరుగుబాటు రూపం తీసుకుంటుంది. నేపాల్‌లో ఇదే జరిగింది. యువత సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని తమ స్వేచ్ఛపై దాడిగా భావించారు ... కుజుడి శక్తి దానిని వీధి ఉద్యమంగా మార్చింది. అందుకే ఈ ఉద్యమం కేవలం సాంకేతికతకు సంబంధించినది కాదు, ఆత్మగౌరవం మరియు అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నగా మారింది.
గురువు మేధో విప్లవాన్ని సృష్టించాడు
గురువు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు. మిథునం స్వభావం ద్వంద్వంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం ఏమిటంటే ఉద్యమంలో కొత్త ఆలోచన , మేధో విప్లవం కనిపిస్తున్నప్పటికీ, ఇది ఏకం కాలేకపోతోంది. యువత వేర్వేరు సమూహాలుగా విడిపోయారు. నాయకత్వంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందుకే నేపాల్‌లో ప్రస్తుతం ఈ ఉద్యమానికి దిశానిర్దేశం చేయగల ఒక వ్యక్తి కూడా ముందుకు రాలేదు. గురువు ఈ పరిస్థితి మార్పు వస్తుందని సూచిస్తుంది, కాని మొదట విభజన విభేదాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
చంద్ర గ్రహణం అగ్నికి ఆజ్యంలా తోడైంది
సెప్టెంబర్ 7-8, 2025 చంద్ర గ్రహణం తర్వాత నేపాల్‌లో పెరిగిన గందరగోళం కూడా యాదృచ్ఛికం కాదు. గ్రహణ కాలం ఎల్లప్పుడూ అధికారం, రాజకీయాలు, సామాజిక నిర్మాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పురాణాలలో గ్రహణం తర్వాత రాజు కుర్చీ కదులుతుందని ప్రజల అసంతృప్తి వ్యక్తమవుతుందని ఉంది. నేపాల్‌లో సెప్టెంబర్ 7న జరిగిన గ్రహణం ఈ మొత్తం ఉద్యమానికి జ్యోతిష్య ట్రిగ్గర్‌గా నిరూపితమైంది. దాని తరువాత నిరసనలు తీవ్రమయ్యాయి, హింస పెరిగింది , చివరికి అధికారం పతనం అయింది.
ఇప్పుడు ఏం జరుగుతుందనే ప్రశ్న. 2025 సంక్షోభం కేవలం ప్రారంభం అని జ్యోతిష్యం చెబుతోంది. శని రాహువుల కలయిక అస్థిరత చాలా కాలం పాటు కొనసాగుతుందని సూచిస్తుంది.
సంవత్సరం 2026 మార్పుల సంవత్సరం అవుతుంది
2026లో న్యాయం , రాజ్యాంగంపై కొత్త చర్చలు జరుగుతాయి. యువత తమ డిమాండ్లను మరింత తీవ్రతరం చేస్తారు ఈ ఉద్యమం నేపాల్ ప్రజాస్వామ్యం యొక్క మూలాలను కదిలిస్తుంది.
గురువు , శని అనుకూల స్థితిలో ఉన్నప్పుడే స్థిరత్వం లభిస్తుంది.. ఆ సమయం 2027 నాటికి వస్తుంది. అప్పటి వరకు నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాలు, నాయకత్వ వివాదాలు, సామాజిక అశాంతిని ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ సమయంలో జ్యోతిష్య నివారణలు కూడా ముఖ్యమైనవిగా పరిగణించవచ్చు. యువత శక్తిని సానుకూల దిశలో నడిపించడానికి బుధ-కుజ సాధన అవసరం. ఈ శక్తి హింస వైపు వెళితే, పరిస్థితి మరింత దిగజారుతుంది, కాని దీనిని సానుకూల శక్తిగా మార్చినట్లయితే, ఈ Gen-Z నేపాల్ భవిష్యత్తును నిర్మిస్తుంది.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రాజకీయాలు చెబుతున్నాయి..కాలచక్రం కూడా మార్పును కోరుకుంటోందని జ్యోతిష్యం చెబుతోంది.
శని-రాహువులు అధికారాన్ని సవాలు చేస్తున్నారు, బుధ-కుజులు యువత విప్లవానికి ఊపిరి పోస్తున్నారు కొత్త నాయకత్వం తప్పకుండా వస్తుందని గురువు సూచిస్తున్నారు..ఇదంతా విభజన , పోరాటం తరువాత. అందుకే జ్యోతిష్య గణన ఇంకా ప్రారంభం మాత్రమేనని, నేపాల్ మరింత లోతైన మార్పులను ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టంగా చెబుతోంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఏబీపీ దేశం ఎటువంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.





















