Horoscope Today 12 December 2024: ఈ రాశివారు మొండివైఖరి వీడకపోతే ప్రియమైన వారు దూరం అయిపోతారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 12th December 2024
మేష రాశి
కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది. పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. మీ లక్ష్యాల గురించి జాగ్రత్తగా ఉండండి. మీ నుంచి సలహాలు తీసుకుంటారు. ఈరోజు మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు
వృషభ రాశి
భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మతపరమైన కార్యక్రమాల పట్ల మనసులో నిరాసక్తత ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండవచ్చు.
మిథున రాశి
ఈ రోజు మిథునరాశి వారికి మంచి ప్రారంభం అవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి సలహా నుంచి ప్రయోజనం పొందుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారంలో సాంకేతికతను బాగా ఉపయోగించుకుంటారు
Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది
కర్కాటక రాశి
ఈ రోజు మీరు చాలా తెలివిగా పని చేస్తారు. అవసరం అయినవారికి సహాయం చేస్తారు. నూతన ఉద్యోగం కోసం చూస్తున్నట్టైతే ఇదే మంచి సమయం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రియమైనవారి సలహా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సింహ రాశి
రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రతిష్ట తగ్గవచ్చు. ఉద్యోగులకు పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. పనికిరాని వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయద్దు.
కన్యా రాశి
కన్యారాశి వ్యక్తుల కుటుంబంలో సామరస్యం లోపిస్తుంది. మోసపూరిత స్వభావం ఉన్న వ్యక్తులను దూరం ఉంచండి. స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభం ఉంటుంది.
తులా రాశి
తులా రాశి వారు కష్టంగా భావించిన పనులను ఈ రోజు సులభంగా పూర్తి చేస్తారు. మీ అవగాహన, తెలివితేటలకు ప్రశంసలు అందుతాయి కుటుంబ బాధ్యతల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. పరిశ్రమల నుంచి చాలా లాభం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మీ ప్రవర్తనను నియంత్రించండి. మీ పని విషయంలో ఇతరుల నుంచి ఎక్కువ అభిప్రాయాలు తీసుకోకండి.
Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు చాలా ఆందోళన చెందుతారు. యువతకు పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ రావచ్చు. చాలా కాలంగా ఉన్న సమస్య తొలగిపోతుంది. మీరు మీ పనిని మంచి మార్గంలో పూర్తి చేస్తారు. మీరు పరిశోధన పనిలో అద్భుతమైన విజయాన్ని పొందుతారు.
మకర రాశి
ఈ రోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు డిపెండెంట్‌గా భావిస్తారు. వైవాహిక జీవితం చాలా ఒత్తిడితో కూడుకున్నది అవుతుంది. మీ మొండి వైఖరిని విడిచిపెట్టడం మంచిది...లేదంటే మీ ప్రియమైనవారు మీ నుంచి దూరం అవుతారు.వ్యసనాలకు దూరంగా ఉండాలి.
కుంభ రాశి
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు శుభఫలితాలు పొందుతారు. పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొంటారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
మీన రాశి
ఈ రాశివారు వృత్తి విషయంలో ఒత్తిడికి లోనవుతారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. తప్పుడు సమాచారం ఇవ్వడం మీ విశ్వసనీయతను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.