Horoscope Today 11 December 2024: ఈ రాశులవారికి ఆకస్మిక ఆదాయం..అనుకోని ఖర్చు రెండూ ఒకేసారి జరుగుతాయి!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 11th December 2024
మేష రాశి
మేష రాశి వారు ఈ రోజు నూతన పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులకు మంచి సమయాన్ని కేటాయించండి. వ్యాపార లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనులు పూర్తవుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొత్త ఖర్చులు కూడా తలెత్తవచ్చు. స్నేహితులతో సైద్ధాంతిక విభేదాలుంటాయి. వ్యాపారం, ఉద్యోగంలో బిజీగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. సంతోషంగా ఉంటారు.
మిథున రాశి
ఈ రాశివారు తమ తప్పులకు పశ్చాత్తాపపడతారు. మాట్లాడేటప్పుడు చెడు పదాలు ఉపయోగించవద్దు. మానసిక క్షోభకు గురవుతారు. నిరుద్యోగులు కెరీక్ కోసం కష్టపడతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేస్తారు. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి చాలా మంచి రోజు కానుంది. మీరు కార్యాలయంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ పనులు సమయానికి పూర్తిచేస్తారు.
సింహ రాశి
సింహరాశివారికి ఈ రోజు మంచిది. మీరు వాహన ఆనందాన్ని పొందుతారు. విదేశీ ప్రయాణాల సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహిత వ్యక్తుల బంధం స్థిరపడుతుంది. కుటుంబంలో విభేదాలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు
కన్యా రాశి
ఈ రోజు మీరు ప్రారంభించే యొక్క కొన్ని పనులు అసంపూర్తిగా ఉండిపోతాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. మీరు కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. నిరుద్యోగుల కెరీర్ బావుంటుంది.
Also Read: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!
తులా రాశి
ఈ రాశి వారు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళవచ్చు. కొన్ని పనులకు సంబంధించి కొనసాగుతున్న సమస్య పరిష్కారమవుతుంది. మీ ప్రశాంత స్వభావానికి చాలా మంది ముగ్ధులవుతారు. ఈరోజు మంచి రోజు కానుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి చెందిన ఉద్యోగస్తులు ప్రమోషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. ఈరోజు మంచి రోజు కానుంది. మహిళలు మంచి లాభాలు పొందుతారు. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త వింటారు.
ధనుస్సు రాశి
మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించాలి. శత్రువులు పొంచి ఉన్నారు అప్రమత్తంగా ఉండాలి.
మకర రాశి
ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనుల్లో జాప్యం వల్ల మీరు కలత చెందుతారు. ముఖ్యమైన పత్రాలను భద్రంగా ఉంచండి. ఆహారంపై నియంత్రణ ఉండాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు సాధారణ రోజు కానుంది. కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. విమర్శలకు దూరంగా ఉండండి. మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు కొత్త మూలం నుంచి లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పనిని సమయానికి పూర్తి చేస్తారు
మీన రాశి
కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ప్రవర్తించకండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కొన్ని పనుల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఈ రోజు మీకు ఒత్తిడితో కూడిన రోజు కావచ్చు. ఏకాంతంగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.