Horoscope Today 07 December 2024: ఈ రాశులవారు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు బహిర్గతం అవుతాయి
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 07th December 2024
మేష రాశి
ఈ రోజంతా సరదాగా ఉంటారు. వృత్తి , ఉద్యోగం, వ్యాపారంలో పనిపట్ల పెద్దగా శ్రద్ధ చూపించరు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. అనుకోని ఖర్చులుంటాయి. వాహనం జాగ్రత్తగా నడపండి. మీకు సంబంధించి ఏదైనా వస్తువు పోయినట్టైతే ఈ రోజు దాన్ని తిరిగి పొందుతారు.
వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి వారికి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ఏదైనా పని విషయంలో టెన్షన్ ఉంటే, అది కూడా చాలా వరకు దూరమవుతుంది. వ్యాపారంలో పెద్ద ప్రాజెక్ట్ పొందవచ్చు. మీరు అకస్మాత్తుగా ఏదైనా పని కోసం విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. బ్యాంకింగ్ రంగాలలో పని చేసే వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు.
మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారికి ప్రోత్సాహకరమైన రోజు. మీ శక్తిని పనికిరాని కార్యకలాపాలలో ఉపయోగించడం వల్ల పనిని భారంగా భావిస్తారు. మీకు దగ్గరగా ఉన్నవారు చెప్పిన విషయాల గురించి మీరు బాధపడతారు. వ్యాపారంలో మార్పులు చేర్పులు ఉంటాయి. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు బహిర్గతం అవుతాయి.
Also Read: డిసెంబరు 07 సుబ్రహ్మణ్య షష్ఠి - పెళ్లి, పిల్లలకు సంబంధించిన సమస్యలకు చక్కని పరిష్కారం!
కర్కాటక రాశి
కర్కాటక రాశి వ్యక్తులు ఈ రోజు ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఆలోచనాత్మకంగా మాట్లాడాల్సి ఉంటుంది. సహోద్యోగుల నుంచి సలహాలు స్వీకరించండి. తల్లిదండ్రుల సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి.
సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో సమస్యలు ఉంటాయి. ఏ పని కోసం ఇతరులపై ఆధారపడకూడదు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి.
కన్యా రాశి
ఈ రోజు కన్యారాశి వారి ఉద్యోగులు పదోన్నతికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం పొందుతారు. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని సమస్యల పరిష్కారానికి అప్పులు చేయాల్సి రావొచ్చు.
తులా రాశి
ఎవరికీ సలహా ఇవ్వకండి. దాతృత్వ కార్యక్రమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. గతంలో చేసిన అప్పులు చెల్లించడంలో సఫలం అవుతారు. రోజంతా బిజీగా ఉంటారు..ఎదుటివారితో ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆలోచనాత్మకంగా చెప్పవలసి ఉంటుంది.
Also Read: ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మీరు చేయాల్సిన పని విషయంలో ఇతరులను విశ్వశించవద్దు. చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకులు ఎదుర్కొంటారు. అనవసర వాగ్ధానాలు చేసి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు. పాత అనారోగ్య సమస్యలు తిరిగి తలెత్తవచ్చు.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రోజు ప్రారంభం బలహీనంగా ఉంటుంది. చట్టపరమైన విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదాలు కొనసాగుతూ ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు.
మకర రాశి
ఈ రాశివారు మాటలు, ప్రవర్తన నియంత్రించాల్సి ఉంటుంది. చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఇబ్బందిపెడతాయి. పనిలో తొందరపాటు మీకు నష్టం కలిగిస్తుంది. వ్యాపార సంబంధిత ఒప్పందాల్లో తెలివిగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులనుంచి సహకారం ఉంటుంది.
Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!
కుంభ రాశి
ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టుకునేందుకు ప్లాన్ చేస్తారు. చాలాకాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తాయి. పుస్తకాలు చదవడంపై ఆసక్తి చూపిస్తారు. కుటుంబ సభ్యుల వృత్తి, ఉద్యోగాల గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఉంటారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.