Mangal Gochar 2023: సింహరాశిలో కుజుడి సంచారం ఈ రాశులవారికి అంతా శుభమే
జూన్ 30 నుంచి మొదటి వారం నుంచి ఆగస్టు 17 వరకూ కుజుడు సింహరాశిలో సంచరించనున్నాడు. ఈ ఫలితంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది.
Mangal Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కుజుడు ధైర్యం, భూమి, వివాహానికి కారకుడు. జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటే దేనికీ లోటుండదు. అశుభ స్థానంలో ఉంటేమాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు కుజుడు. ఇది కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తుంది.
మేష రాశి
మేష రాశివారు కుజుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ రాశినుంచి నాలుగో స్థానంలో కుజుడి సంచారం జరుగుతోంది. ఈ ఫలితంగా నచ్చిన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తారు.తలపెట్టిన పనిలో కుటుంబ సభ్యుల సపోర్టు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
వృషభ రాశి
వృషభ రాశి వారు అంగారకుడి సంచారం వల్ల లాభపడతారు. సింహరాశిలో ఈ కుజుడు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశిలో, కుజుడు జాతకంలో నాల్గవ ఇంట ఉన్నాడు. నూతన వాహనానికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబంతో సరదాగా ఆనందంగా గడుపుతారు . అనుకోని ధనలాభం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది.
Also Read: దేవాలయాల్లో ఈ దానం చేస్తే పదితరాలకు మంచి జరుగుతుంది!
సింహ రాశి
సింహ రాశి వారికి కుజుడి సంచారం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశిలో కుజుడు నాలుగు , తొమ్మిది స్థానాలకి అధిపతి. ఈ కారణంగా మీరు శక్తివంతంగా, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీరు ఏ పనినైనా భాద్యతగా, సులభంగా పూర్తి చేయగలుగుతారు. నాల్గవ ఇంట కుజుడు ఉండటం వల్ల అదృష్టం మీ వెంట ఉంటుంది, సింహ రాశి వారికి భూమి, వాహనం, డబ్బు విషయంలో విజయం లభిస్తుంది. కుజ సంచారం వలన ధన లాభాలు ఉంటాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కుజ సంచారం శుభప్రదం కానుంది. కుజుడు ధనుస్సు రాశిలో తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ఫలితంగా వృత్తి వ్యాపారాలకు అనుకూలం. ఏ పని తలపెట్టినా అదృష్టం కలిసొస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఎప్పటి నుంచో ఉన్న తీరని కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశముంది. విద్యార్థులకి కోరుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం దొరుకుతుంది.
Also Read: రామాయణంతో ముడిపడిన ప్రదేశాలు శ్రీలంకలో ఎన్నో ఉన్నాయి!
వృశ్చిక రాశి
సింహ రాశిలో కుజుడి సంచారం వృశ్చిక రాశివారికి లాభాన్నిస్తుంది. అనుకోని ధనం చేతికందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబంలో, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఊహించని ధనలాభాన్ని పొందుతారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.