అమితాబ్, రజనీ, మాధురి దీక్షిత్ జాతకంలో ఉండే మాలవ్య రాజయోగం ఇప్పుడు ఈ 3 రాశులవారికి కలుగుతోంది!
2025 నవంబర్ 2న శుక్రుడు తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల 'మాలవ్య రాజయోగం' ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులకు లాభదాయకం.

Malavya Rajyog 2025: నవంబర్ ప్రారంభంలోనే శుక్రుడు రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు నవంబర్ 2, 2025న కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తాడు.
తులా రాశిలో శుక్రుడి సంచారం చాలా రాశులకు శుభప్రదంగా ఉండబోతోంది. కారణం అంటంటే శుక్రుడు తులా రాశికి అధిపతి.
శుక్రుడిని భోగం, విలాసం, సుఖం, సంపద, ప్రేమ, శృంగారం, వివాహానికి కారకుడిగా పరిగణస్తారు.
శుక్ర రాశి పరివర్తనం 2025 (Shukra Gochar 2025)
తులసి వివాహం (Tulsi Vivah) రోజున నవంబర్ 2 ఆదివారం మధ్యాహ్నం శుక్రుడు తులా రాశిలో ప్రవేశిస్తాడు. శుక్రుడు తన సొంతరాశి అయిన తులలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని శుభ , శక్తివంతమైన యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం కొన్ని రాశుల అదృష్టాన్ని కూడా మార్చబోతోంది. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రేమ పెరుగుతుంది.
మాలవ్య రాజయోగం అంటే?
మాలవ్య రాజయోగం జ్యోతిష్య శాస్త్రంలో పంచమహాపురుష యోగాల్లో ఒకటి. ఇది శుక్ర గ్రహం (Venus) బలంగా ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్న వ్యక్తులు సాధారణంగా అందం, కళలు, ఐశ్వర్యం, విలాసం, ఆకర్షణ కలిగి ఉంటారు.
మాలవ్య రాజయోగం ఏర్పడే నియమాలు
శుక్రుడు కేంద్ర స్థానంలో ఉండాలి ( మీ రాశి నుంచి శుక్రుడి సంచారం 1, 4, 7, 10వ స్థానంలో ఉండాలి)
శుక్రుడు తన స్వక్షేత్రం లేదా ఉచ్ఛ స్థానంలో ఉండాలి
స్వక్షేత్రం: వృషభం, తుల
ఉచ్ఛ స్థానం : మీన రాశి
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మధురి దీక్షిత్, లతా మంగేష్కర్ వంటి వారి జాతకాల్లో మాలవ్య యోగం ఉన్నట్టు జ్యోతిష్యులు చెబుతారు.
నవంబర్ 2 నుంచి ఏర్పడే మాలవ్య రాజయోగం ఈ రాశులకు శుభం (Malavya Rajyog 2025)
వృషభ రాశి (Taurus)
మాలవ్య యోగం వృషభ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పనుల్లో వేగం పెరుగుతుంది. అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ఆగిపోయిన లేదా నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో వేగం పుంజుకుంటాయి. నవంబర్ 2 తర్వాత వృషభ రాశి వారి కష్టాలు నెమ్మదిగా తగ్గుతాయి.
తులారాశి (Libra)
శుక్ర గోచారం తర్వాత ఏర్పడే మాలవ్య రాజయోగం తులారాశివారికి కలిసొస్తుంది. ఈ రాజయోగం మీ రాశి లగ్నం అంటే మొదటి ఇంట్లో ఏర్పడుతుంది. ఇది మీ వైవాహిక జీవితంలో ప్రేమను పెంచుతుంది. ప్రేమికుల బంధంలో బలం పెరుగుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి కూడా మాలవ్య రాజయోగం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం మీ ఆదాయాన్ని పెంచుతుంది, పెట్టుబడుల నుంచి లాభాన్ని అందిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. మాలవ్య రాజయోగం ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
కార్తీక మహాపురాణం కథ DAY-1: కార్తీకమాస పవిత్రత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శివభక్తి, దీపారాధన మహత్యం!
Karthika Masam 2025 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!





















