అన్వేషించండి

చంద్ర గ్రహణం 2025: మీరు పుట్టిన తేదీ ఆధారంగా మీపై సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది? పరిష్కారాలేంటి?

Lunar Eclipse 2025: సెప్టెంబర్ 7, 2025 న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఒక్కో తేదీలో జన్మించినవారిపై ఈ ప్రభావం ఒక్కోలా ఉంటుంది...

Chandra Grahan 2025 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహణం ఓ వ్యక్తి మనస్సు, కెరీర్, సంబంధాలు, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కో రాశివారిపై, ఒక్కో తేదీలో జన్మించినవారిపై గ్రహణం వేర్వేరు ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి ఇది కష్టాలు ,మానసిక ఒత్తిడితో నిండిన సమయం కావొచ్చు, మరికొందరికి ఇది శుభప్రదంగా ఉండవచ్చు, మరికొందరికి ఆత్మపరిశీలన సమయం కావచ్చు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం 2025 సెప్టెంబర్ 7 రాత్రి 9.56 నుంచి 1.26 వరకూ మొత్తం 3 గంటల 30 నిముషాల పాటు ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసుకోండి

నంబర్ 1, 10, 19, 28

చంద్రగ్రహణం సమయంలో ఆ ప్రభావం మీ ఆత్మవిశ్వాసంపై పడుతుంది. పనిచేసే ప్రదేశంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. చేసిన పనినే మళ్లీ చేయాల్సి రావొచ్చు.
 
నంబర్ 2, 11,20,29

ఈ తేదీల్లో జన్మించినవారికి చంద్రగ్రహణం ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మానసిక సమతుల్యత, భావోద్వేగ స్థితిపై ప్రభావం చూపిస్తుంది.  సంబంధాలలో విభేదాలు రావొచ్చు..అనుకోని దూరం ఏర్పడుతుంది. ఆరోగ్యం కోసం ధ్యానం ,  మెడిటేషన్ చేయడం మంచిది.
 
నంబర్ 3, 12, 21, 30

ఈ గ్రహణం ఈ తేదీల్లో జన్మించిన వారి కెరీర్ ,  సామాజిక జీవితంలో మార్పులు తెస్తుంది. ఏదైనా పనిలో ఆటంకం ఏర్పడుతుంది, కానీ సహనంతో ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

నంబర్ 4, 13, 22, 31

ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఆకస్మికంగా ఆర్థిక హెచ్చుతగ్గులను చూడాల్సి వస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి.

నంబర్ 5, 14, 23
 
చంద్రగ్రహణం సమయంలో కొంచెం సవాలుగా ఉంటుంది. సంబంధాలలో అపార్థాలు ఎదురవుతాయి. పనిచేసే ప్రదేశంలో అనుకోని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఏదైనా కొత్త ప్రారంభానికి దూరంగా ఉండండి.

నంబర్ 6, 15, 24

చంద్రగ్రహణ సమయం వ్యక్తిగత జీవితం, ప్రేమ సంబంధాల్లో ఒత్తిడిని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. పాత వివాదాలకు దూరంగా ఉండండి. 

నంబర్ 7, 16, 25

ఈ సమయం మీకు ఆత్మపరిశీలన , ఆధ్యాత్మిక దృష్టిని బలపరిచేదిగా ఉంటుంది. మానసిక అలసట , ఒంటరితనం అనిపించవచ్చు. పుస్తకాలు చదవడం లేదా ప్రయాణం చేయడం మీకు శాంతినిస్తుంది.

నంబర్ 8, 17, 26

చంద్రగ్రహణం సమయంలో వ్యాపారం , ఉద్యోగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. గుడ్డిగా ఎవరినైనా నమ్మడం వల్ల నష్టం వాటిల్లుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

నంబర్  9, 18, 27

గ్రహణం మీ ఉత్సాహం, మీ శక్తిని ప్రభావితం చేస్తుంది. కోపం తెచ్చుకోకుండా ఉండండి . కుటుంబంలో వివాదాలకు చోటివ్వవద్దు.. సంయమనం పాటించండి. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

2025 సెప్టెంబర్ 07 ఆదివారం  సంపూర్ణ చంద్రగ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

బాబా వాంగ 2025లో ఏం జరగబోతోందో చెప్పిన భయంకరమైన భవిష్యవాణి ప్రభావం భారతదేశంలో కనిపిస్తోందా! పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజు కలిసొస్తుందా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి ఈ రోజు కలిసొస్తుందా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి శుభమా? అశుభమా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి శుభమా? అశుభమా?
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ముఖ్యమైన సూచనలు!
09-10-2026 శుక్రవారం రాశిఫలాలు: కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ముఖ్యమైన సూచనలు!
09-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథున రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయంటే!
09-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథున రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయంటే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget