News
News
X

ఫిబ్రవరి 15 ప్రేమ రాశిఫలాలు: ఈ రాశులవారికి జీవిత భాగస్వామితో దూరం తగ్గుతుంది, ప్రేమ జీవితంలో ఆకర్షణ పెరుగుతుంది

Love Rasi Phalalu Today 15 February 2023 :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

మేష రాశి

ఎలాంటి సీరియస్ రిలేషన్ షిప్ లో ఉండకండి. జీవితంలో రొమాన్స్ తిరిగి వస్తుంది. ప్రేమికుడు మీపై కోపంగా ఉండవచ్చు. మీ హృదయపు మాటలతో దాన్ని సెలబ్రేట్ చేసుకోండి.

వృషభ రాశి 

ఈ రోజు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. సంబంధాలు బలపడతాయి. సంతానం లేని దంపతులు శుభవార్త వినేఅవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. తమ మనసైన వారికి సమయం కేటాయిస్తారు

మిథున రాశి

మానసిక కల్లోలం వైవాహిక జీవితంలో వివాదాలను సృష్టిస్తుంది. కోపం కారణంగా బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఒకటి కంటే ఎక్కువ ప్రేమ సంబంధాలు మీ మధ్య దూరాన్ని పెంచుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి బంధంలో విభేదాలకు దారితీస్తాయి.

Also Read: మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

కర్కాటక రాశి

వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ప్రేమజీవితంలో ఆకర్షణ పెరుగుతుంది.

సింహ రాశి 

ప్రేమికులు సంతోషంగా ఉంటారు. విదేశాల నుంచి అతిథులు రావొచ్చు. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీరు తెలివిగా పనిచేస్తే, మీరు సంబంధాల నుంచి ప్రయోజనం పొందుతారు.

కన్యా రాశి 

మీ ప్రియురాలు/ప్రియుడి మనోభావాలను అర్థం చేసుకునేందకు ప్రయత్నించండి..ఇది మీ ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తుంది. చదువు పరంగా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల బంధంలో మాధుర్యం పెరుగుతుంది.

Also Read: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!

తులా రాశి

ఈ రోజు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రోజు సంబంధాలకు నమ్మకం, ప్రేమ చాలా అవసరం...లేదంటే ప్రేమ భాగస్వామితో బ్రేకప్ జరిగే అవకాశం ఉంది. మీరు అనైతిక సంబంధాలకు దూరంగా ఉండాలి. మీ  భాగస్వామి మనసులో మీపై ఉన్న అపనమ్మకాన్ని తొలగించేందుకు ప్రయత్నించండి

వృశ్చిక రాశి 

ప్రేమికులు పెళ్లిచేసుకునేందుకు ఇదే అనుకూల సమయం. అవివాహితులకు విదేశాల నుంచి సంబంధాలు రావొచ్చు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతారు. ఈ రోజు మీ మాటలతో అందరి మనసులను ఆకర్షిస్తారు.

ధనుస్సు రాశి 

ఈ రోజు పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ప్రేమ సంబంధాలకు ఈ రోజు అంత మంచిది కాదు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.

మకర రాశి

ప్రేమికులను వివాహం చేసుకోవాలనుకుంటే శుభ సమయం వచ్చేసింది. తెలివైన విద్యావంతుడైన జీవిత భాగస్వామిని మీరు ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. వివాహితులు ఓ శుభవార్త వింటారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి

ఈ రాశివారి మనసు చంచలంగా మారుతుంది. మీరు మీ ప్రియురాలితో ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. కానీ వారు ఏదో విషయంలో మీపై కోపంగా ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి, మీరు సున్నితంగా ఉండాలి. ఏ రకమైన అబద్ధం చెప్పినా అది మీ సంబంధాన్ని చెడగొడుతుంది.

మీన రాశి

ఈ రోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనసులో ఆనందం ఉంది, జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. ప్రేమికులు కూడా ఈ రోజు గుర్తుండిపోయేలా ఆస్వాదిస్తారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.

Published at : 15 Feb 2023 06:17 AM (IST) Tags: Astrology Daily Love Horoscope Todays Love Horoscope Love and Relationship Horoscope Love and Relationship Horoscope 15 February

సంబంధిత కథనాలు

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!