By: RAMA | Updated at : 04 Feb 2023 06:56 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Freepik
Love Rasi Phalalu Today 04th February 2023 : ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
మేష రాశి ప్రేమికులు ఈ రోజంతా జ్ఞాపకాలతో గడుపుతారు. భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకుని తీర్చేందుకు ప్రయత్నిస్తారు. వివాహితులకు ఖర్చులు పెరుగుతాయి
వృషభ రాశి
ప్రేమ జంటలు ఈ రోజు తమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ భాగస్వామితో ఏదో విషయంలో వివాదం ఏర్పడుతుంది. సమస్యను ఆరంభంలోనే సర్దుబాటు చేసుకోవడం మంచిది
మిథున రాశి
ఈ రోజు మీరు ఇంటి పనిలో మీ జీవిత భాగస్వామికి మద్దతు ఇస్తారు. ప్రేమికులు కూడా తమ ప్రియమైన వారిని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కడికైనా రొమాంటిక్ ప్లేస్ కి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. అవివాహితుల వివాహంలో జాప్యం జరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి చెందిన దంపతులు జీవితాన్ని ఆస్వాదించే ప్రణాళికలు వేసుకుంటారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం ద్వారా మంచి మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో ఉత్సాహంగా ఉండాలి. బయటి వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ కుటుంబ విషయాలపై కూడా ఉండేలా చూసుకోవాలి
Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!
సింహ రాశి
లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో ఈ రాశివారి తర్వాతే ఎవరైనా. ప్రేమికులు లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. వివాహితుల మధ్య మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి.
కన్యా రాశి
మీ ప్రేమ భాగస్వామి నుంచి మీరు మంచి బహుమతి పొందుతారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నేరుగా మాట్లాడండి.. అనవసర దాపరికం ఉండకపోవడం మంచిది, సంకోచం అస్సలే వద్దు. ప్రేమికులు సంతోషంగా ఉంటారు.
తులా రాశి
ఈ రోజు మీరు మీ ప్రియురాలితో మంచి సమయం గడుపుతారు. వివాహితులు తలపెట్టే ఏ పనులకైనా జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ రోజు మీ మాజీ ప్రేమికులను కలవాలి అనుకుంటే ఆ పని జరగదు.
వృశ్చిక రాశి
మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదే మంచి సమయం. ఖాళీ సమయాన్ని వారితో గడిపేందుకు ప్లాన్ చేసుకోండి. మీ ప్రేమ జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడాల్సి ఉంటుంది. మీ ప్రియమైన వారు చెప్పే మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు.
Also Read: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి ప్రేమలో పరస్పర సంబంధాలు బలపడతాయి. మీరు మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవచ్చు. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశివారు బంధం బావుంటుంది.
మకర రాశి
మకర రాశి వారు కుటుంబానికి సమయం కేటాయించండి. వైవాహిక జీవితంలో ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రేమికులకు పెద్దగా సమస్యలు ఉండవు
కుంభ రాశి
మీ జీవితం పట్ల మీరు పూర్తిస్థాయి స్థాయి ఏకాగ్రతను పెట్టండి. ఎలా ఉంటే సంతోషంగా ఉంటారో ఆలోచించండి. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా మీరే తీసుకుంటే మంచిది. మరో వ్యక్తిని జోక్యం చేసుకోనివ్వవద్దు.
మీన రాశి
ఈ రోజు ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతోంది. పెళ్లిచేసుకోవాలి అనుకునేవారు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం మంచిది. వైవాహిక జీవితంలో మాత్రం టెన్షన్ ఉంటుంది.
మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం
వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు
Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం