ఈ రాశివారు వంకర స్నేహితులను దూరం ఉంచండిమేష రాశి
ఈ రాశివారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులు ముఖ్యమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు మరోసారి ఆలోచించండి. ఈరాశి దంపతుల మధ్య ప్రేమ ఉంటుంది. ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. వంకర స్నేహితులు ఉన్నారు..వారిని దూరం పెట్టండి.వృషభ రాశి
ఈ రాశి వ్యక్తులు ఈ రోజు ఏదో వివాదం కారణంగా కలత చెందుతారు. పనిచేయాలనే ఫీలింగ్ ఉండదు. ప్రభుత్వ పనులు సులువుగా పూర్తిచేస్తారు. విద్యార్థులకు చదువు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండిమిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన రోజు కాబోతోంది. మీరు మీ సన్నిహిత మిత్రులను కలుస్తారు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్లాన్ వేస్తారు, కుటుంబ సభ్యుల సలహాలు తప్పక తీసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.కర్కాటక రాశి
ఈ రాశివారు ముఖ్యమైన పనులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు కానీ మీపై పని ఒత్తిడి తప్పదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటారు. మీ వాహనం కారణంగా మీ పనికి ఆంటంకం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారు ఏకాంత సమయం గడిపేందుకు ఇష్టపడతారు. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త. పరిచయం ఉన్న వ్యక్తుల వల్ల మీ పనులు కొన్ని సులభంగా పరిష్కారం అవుతాయి. తెలియని వ్యక్తులతో అతి చనువు ప్రదర్శించకండి...చిక్కుల్లో చిక్కుకుంటారు.కన్యా రాశి
ఈ రాశి వారు వ్యాపారానికి సంబంధించి అవసరమైన మార్పులు చేసుకుంటారు. ఆర్థిక లాభం పొందుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలను వెంట వెంటనే తీసుకోవద్దు.తులా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. విదేశాల్లో ఉండే బంధువులను కలుస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగం, వ్యాపారం విషయంలో నిర్లక్ష్యం వల్ల నష్టం తప్పదు.వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈరోజు రిస్క్ తీసుకోపోవడం మంచిది. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రేమికులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. వివాహం కోసం మంచి ప్రతిపాదనలు పొందే అవకాశం ఉంది. భౌతిక వనరుల పెరుగుదల ఉంటుంది.ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు. పనికిరాని పనుల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. సమయపాలనపై అవగాహన కలిగి ఉండండి.మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారు శుభవార్త వింటారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. విహారయాత్రకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. అతి విశ్వాసం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది..జాగ్రత్త పడండి.కుంభ రాశి
కుంభరాశి వారు తమ కెరీర్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి, ప్రమాదకర పనులు జాగ్రత్తగా చేయండి.మీన రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపార సంబంధిత సమస్యలను ముందే గుర్తించే అవకాశం ఉంది. అప్పులు తీర్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ పని విషయంలో ఎవరిపైనో ఆధారపడే బదులు..మీకు దగ్గర్లో ఉండేవారికి అప్పగిస్తే పూర్తవుతుంది.


Thanks for Reading. UP NEXT

ఈ రాశివారు అల్లరి ప్రేమికులు

View next story