ఈ రాశివారు అల్లరి ప్రేమికులు



మేష రాశి
ఈ రాశివారికి ప్రేమికులతో విభేదాలు తలెత్తుతాయి. మాటల్లో సంయమనం పాటించండి. అవివాహితులు ఒంటరిగా ఫీలవుతారు.
వివాహితుల మధ్య బంధం బాగానే ఉంటుంది.



వృషభ రాశి
మీ మనసైనవారితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త బంధం ప్రారంభించేందుకు ఇదే శుభసమయం.



మిథున రాశి
ఈ రోజు మీరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ప్రేమికులు తమ భాగస్వామితో ప్రత్యేక సమయం గడిపేందుకు ప్రణాళిక వేసుకుంటారు. వివాహితులు సంతోషంగా ఉంటారు.



కర్కాటక రాశి
మీ బంధం బలపడాలంటే ముందు మీరు సమయం కేటాయించాలి. ప్రేమ భాగస్వామికి అయినా, జీవిత భాగస్వామికి అయినా టైమ్ ఇచ్చే ఆలోచన చేయండి. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది.



సింహ రాశి
ఈ రాశి వివాహితుల మధ్య సమన్వయం బాగుంటుంది. మీరు మీ కంటే పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమికులు పెళ్లిదిశగా ఆలోచించే అవకాశం ఉంది..ఇదే మంచి సమయం కూడా.



కన్యా రాశి
భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. ప్రేమికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వీరికి జీవిత భాగస్వామి నుంచి అదృష్టం కలిసొస్తుంది



తులా రాశి
ఈరోజు ఒంటరి పక్షులు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ప్రేమలో ఉన్నవారు పెళ్లిచేసుకునే ఆలోచన చేస్తారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆలోచన మీ బంధాన్ని బలపరుస్తుంది.



వృశ్చిక రాశి
ఈ రాశి పెళ్లికానివారికి వివాహ ప్రతిపాదన రావొచ్చు. మీరు మీ ప్రేమికుల మనసు చదివేస్తారు. వివాహితులు సంతోషంగా ఉంటారు.



ధనుస్సు రాశి
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ భాగస్వామి నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. ప్రేమికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.



మకర రాశి
ఈ రోజు భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. వారి వ్యక్తిగత వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ మాటలు మీ భాగస్వామిని ఇబ్బంది పెడతాయి.



కుంభ రాశి
ఈ రోజు ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు . అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.



మీన రాశి
ఈ రోజు మీ మూడ్ రొమాంటిక్ గా ఉంటుంది . మీరు మీ భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు.