ఫిబ్రవరిలో ఈ రాశులవారికి చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు



కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి కొన్ని ఇబ్బందులు తప్పవు కానీ నెలాఖరుకి కొంత రిలీఫ్ ఉంటుంది.



వృషభ రాశి
వృషభరాశివారికి ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఏ పని చేసినా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. పిల్లలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. నెల మధ్యలో పరిస్థితులు అనుకూలిస్తాయి.



కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఈ నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. పనిప్రాంతంలో సహోద్యోగుల నుంచి ఎక్కువ మద్దతు లభించకపోవడం మనస్సు విచారంగా ఉంటుంది. సమయం అనుకూలంగా లేనప్పుడు ఓ అడుగు తగ్గడమే మంచిది. ఆరోగ్య పరంగా కూడా అంతగా బాలేదు జాగ్రత్త పడండి.



కన్యా రాశి
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల మిశ్రమంగా ఉంటుంది. నెల ప్రారంభంలో తీరికలేకుండా గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కమీషన్ పై పనిచేసే వారికి కొంత ఆందోళన ఉంటుంది. వ్యాపారులకు సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులు నెలాఖరుకల్లా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు.



ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఫిబ్రవరి నెల మిశ్రమంగా ఉంటుంది. ఈ మాసంలో వృత్తి, వ్యాపారాలలో ఒడిదొడుకులు ఉంటాయి. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది కానీ అతికష్టంమీద పూర్తవుతాయి. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు.



మకర రాశి
మకర రాశివారు ఈ నెలలో ఆరోగ్యం, బంధాల విషయంలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో వివాదాలుంటాయి, సమయానికి తిండి నిద్ర ఉండదు. ప్రేమ, వైవాహిక బంధం బలపడాలంటే భాగస్వామి పట్ల శ్రద్ధ వహించాలి. నెల మధ్యలో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది.



కుంభ రాశి
ఫిబ్రవరి ప్రారంభం కుంభరాశివారికి సవాల్ గా ఉంటుంది. ఇంటా బయటా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు శ్రమ అవసరం. వ్యాపార రంగాల వారికి ఈ మాసంలో మాంద్యం ఎదురుకావచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.



ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు



Images Credit: Freepik