ఈ రోజు ఈ రాశులవారు చాలా అదృష్టవంతులు
ఫిబ్రవరి 1 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశి ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. మానసికంగా బలంగా ఉంటారు. వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఈ రాశివారు మాట్లాడేందుకు కొన్నిరోజులు సమయం పడుతుంది కానీ ఆ తర్వాత బాగా కలసిపోతారు. మాట్లాడేటప్పుడు ఎదుటివారిని బాధపెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించండి.



వృషభ రాశి
ఈ రోజు మీరు కాస్త నిరాశగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఏదో విషయంలో నిరాశగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీ మనసులో మాటని నేరుగా మాట్లాడటమే మంచిది



మిథున రాశి
ఈ రాశివారు ఉదయం నుంచి నిస్సత్తువుగా ఉంటారు కానీ సాయంత్రానికి ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ రాశి విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి తగ్గుతుంది. ఆరోగ్యం ఎలా ఉన్నప్పటికీ తాము చేయాల్సిన పనుల విషయంలో మాత్రం వెనక్కు తగ్గరు



కర్కాటక రాశి
కర్కాటక రాశికి చెందిన రాజకీయాల్లో ఉన్నవారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. అయితే మీ రహస్యాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ఉద్యోగులు పని విషయంలో రాజీపడొద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.



సింహ రాశి
ఈ రోజు మీరు మీ భాగస్వామి ప్రేమలో మునిగితేలుతారు...కానీ వారిపై ప్రేమను వ్యక్తపరిచేందుకు మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.



కన్యా రాశి
ఈ రోజు కన్యారాశి వారు ఎవరితోనూ గొడవ పడొద్దు. అది మీకు అంత మంచిగా అనిపించకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది కానీ ఎవరో ఒకరితో మీ విభేదాలు తెరపైకి వస్తాయి. మీరు సంయమనం పాటించడం ద్వారా నెమ్మదిగా సర్దుకుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.



తులా రాశి
ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.. ప్రజా రవాణా ఉపయోగించడం ఇంకా మంచిది. తెలియని వ్యక్తులతో అనవసర సంప్రదింపులు వద్దు



వృశ్చిక రాశి
ఈ రాశివారు తీసుకున్న అప్పులు తీర్చేందుకు మంచి రోజు. వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళితే భవిష్యత్ లో నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగులు పని విషయంలో వెనకడుగు వేయొద్దు. వ్యాపారం బాగానే సాగుతుంది.



ధనుస్సు రాశి
ఈ రాశివారి జీవితంలో పెద్దగా కొత్తదనం ఉండదు. రోజంతా ఏదో బిజీబిజీగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయించండి. మనసులో ప్రతికూల ఆలోచనలు అస్సలు రానివ్వవద్దు.



మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ మనసు చెప్పింది వినండి..ఎవ్వరి నుంచీ సలహాలు తీసుకోవద్దు.



కుంభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. నూతన పెట్టుబడులకు శుభసమయం. వ్యాపారం బాగాసాగుతుంది. ఉద్యోగులు తమ టార్గెట్లు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. ఏపని చేసినా ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి



మీన రాశి
ఈ రోజు మీన రాశివారికి కూడా అనుకూల సమయం. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ మనసులో ఉన్న మాటని బయటకు చెప్పండి. కార్యాలయంలో మీకు అప్పగించిన పని పూర్తిచేయండి. కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. స్నేహితులను కలుస్తారు.