News
News
X

Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు

Love Rasi Phalalu Today 03 February 2023 :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Love Rasi Phalalu Today  03 February 2023 : ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...

మేష రాశి
ఈ రాశివారికి ప్రేమికులతో విభేదాలు తలెత్తుతాయి. మాటల్లో సంయమనం పాటించండి. అవివాహితులు ఒంటరిగా ఫీలవుతారు. వివాహితుల మధ్య బంధం బాగానే ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశివారు మీ మనసైనవారితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త బంధం ప్రారంభించేందుకు ఇదే శుభసమయం.  వివాహితులు కోపానికి అవకాశం ఇవ్వకండి

మిథున రాశి
ఈ రోజు మిథున రాశివారు మీరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ప్రేమికులు తమ భాగస్వామితో ప్రత్యేక సమయం గడిపేందుకు ప్రణాళిక వేసుకుంటారు. వివాహితులు సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న మాటవిసుర్లు తగ్గించుకుంటే మంచిది

Also Read: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు

కర్కాటక రాశి
మీ బంధం బలపడాలంటే ముందు మీరు మీ భాగస్వామికి సమయం కేటాయించాలి. ప్రేమ భాగస్వామికి అయినా, జీవిత భాగస్వామికి అయినా టైమ్ ఇచ్చే ఆలోచన చేయండి. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. 

సింహ రాశి
ఈ రాశి వివాహితుల మధ్య సమన్వయం బాగుంటుంది. మీరు మీ కంటే పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమికులు పెళ్లిదిశగా ఆలోచించే అవకాశం ఉంది..ఇదే మంచి సమయం కూడా. అవివాహితులు సబంధాలు వెతుక్కునే ప్రయత్నంలో ఉంటారు.

కన్యా రాశి
కన్యారాశి భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. ప్రేమికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వీరికి జీవిత భాగస్వామి నుంచి అదృష్టం కలిసొస్తుంది

తులా రాశి 
ఈ రోజు తులారాశికి చెందిన ఒంటరి పక్షులు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు.అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ప్రేమలో ఉన్నవారు పెళ్లిచేసుకునే ఆలోచన చేస్తారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆలోచన మీ బంధాన్ని బలపరుస్తుంది.

వృశ్చిక రాశి
ఈ రాశి పెళ్లికానివారికి వివాహ ప్రతిపాదన రావొచ్చు. మీరు మీ ప్రేమికుల మనసు చదివేస్తారు. వివాహితులు సంతోషంగా ఉంటారు. భాగస్వామికి  సమయం కేటాయించడం ద్వారా మీరు మరింత సంతోషాన్ని పొందుతారు

ధనుస్సు రాశి 
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ భాగస్వామి నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. ప్రేమికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Also Read: మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది, సర్వం ఈశ్వరమయం అంటారెందుకు!

మకర రాశి
ఈ రోజు భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. వారి వ్యక్తిగత వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ మాటలు మీ భాగస్వామిని ఇబ్బంది పెడతాయి. కోపం తగ్గించుకోండి. మాటతూలొద్దు. అనవసర చర్చలకు అవకాశం ఇవ్వొద్దు

కుంభ రాశి
ఈ రోజు కుంభరాశివారికి ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు . అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెళ్లైనవారి జీవితంలో సంతోషం ఉంటుంది

మీన రాశి 
ఈ రోజు మీ మూడ్ రొమాంటిక్ గా ఉంటుంది . మీరు మీ భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు.

Published at : 03 Feb 2023 05:53 AM (IST) Tags: zodiac sign Astrology Daily Love Horoscope Todays Love Horoscope Aquarius Love Horoscope

సంబంధిత కథనాలు

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

మార్చి 27 రాశిఫలాలు, ఈ రాశివారు తమని తాము నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం

టాప్ స్టోరీస్

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Sanjay On DS :  డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్