Jupiter Transit in Cancer: అక్టోబర్ 18నుంచి కర్కాటక రాశిలోకి గురువు! కెరీర్, కుటుంబం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
Jupiter Transit 2025: దేవతల గురువు బృహస్పతి అక్టోబర్ 18న గురుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కర్కాటకం, కన్యా, సింహ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.

Jupiter Transit in Cancer: గురువు మహా గోచారం అక్టోబర్ 18న జరిగింది. ఈ రోజు బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గోచారం ధనత్రయోదశి రోజు జరుగుతుంది. గురువు దాదాపు 49 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత డిసెంబర్ 4న తిరోగమనం చెంది మిథునంలోకి వస్తాడు. ఈ గోచారం జ్యోతిష్యపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది కెరీర్, విద్య, ఆరోగ్యం, కుటుంబం ఆర్థిక విషయాలకు సంబంధించిన పరిస్థితుల్లో పెద్ద మార్పులను తెస్తుంది. ముఖ్యంగా కర్కాటక, కన్యా రాశి వారికి ఈ గోచారం చాలా శుభప్రదంగా ఉంటుంది, అయితే సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
కెరీర్‌పై ప్రభావం
కర్కాటకంలో గురువు సంచారం కెరీర్‌లో పురోగతి కొత్త అవకాశాలను తెస్తుంది. ఎవరైతే పదోన్నతి లేదా ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది అనుకూల సమయం. వ్యాపారం చేసేవారికి కూడా కొత్త పెట్టుబడులు ..విస్తరణకు అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో సింహ రాశి వారు ఖర్చులు నిర్ణయాల్లో జాగ్రత్త వహించాలి, అయితే కర్కాటకం, కన్యా రాశి వారికి ఇది కెరీర్‌లో అభివృద్ధి చెందే సమయం.
పరిహారం: గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి, విష్ణువును పూజించండి
ఆర్థిక స్థితిపై ప్రభావం
గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆస్తి , షేర్ మార్కెట్ నుంచి లాభం పొందే అవకాశాలున్నాయి. అయితే సింహ రాశి వారికి ఖర్చులు పెరిగుతాయి. ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. దీపావళి సమయంలో పెట్టుబడి పెట్టడం శుభప్రదంగా ఉంటుంది.
పరిహారం: భోజనం చేయడానికి ముందు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి
కుటుంబం వివాహ జీవితంపై ప్రభావం
కర్కాటక రాశి వారికి ఈ గోచారం కుటుంబ సౌఖ్యం , వివాహ యోగాన్ని తెస్తుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభ సమయం. గురువు ఉన్నత స్థితి కారణంగా వైవాహిక సంబంధాలలో అవగాహన , ప్రేమ పెరుగుతుంది. వివాహంలో ఆలస్యం అవుతున్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది.
పరిహారం: గురువారం నాడు ఉపవాసం ఉండి, విష్ణువును పూజించండి.. పసుపు చందనం రాయండి.
ఆరోగ్యంపై ప్రభావం
గురువు ఈ గోచారం మానసికంగా శారీరకంగా రెండింటిలోనూ శక్తిని పెంచుతుంది. అయితే సింహ రాశి వారు ఒత్తిడి , అనవసరమైన ఖర్చులను నివారించాలి. సాత్విక ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పరిహారం: మాంసం , మద్యం సేవించకుండా ఉండండి .. ఆహారం తీసుకునే ముందు భగవంతునికి నైవేద్యం సమర్పించండి.
విద్యపై ప్రభావం
విద్యార్థులకు ఇది చాలా శుభ సమయం. విదేశాల్లో చదువుకోవాలని లేదా ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. గురువు అనుగ్రహంతో ఏకాగ్రత , జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
పరిహారం: “ఓం గురువే నమః” మంత్రాన్ని ప్రతిరోజూ జపించండి ..పసుపు కొమ్మును విష్ణు ఆలయంలో సమర్పించండి.
బృహస్పతి ఉన్నత స్థితి కారణంగా సమాజంలో కరుణ, ఆధ్యాత్మికత పెరుగుతుంది.
పరిహారం: విష్ణు చాలీసా , నారాయణ కవచాన్ని పఠించండి. ఇది మానసిక శాంతిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
జాతకంలో బృహస్పతి ప్రతికూల ప్రభావం ఉండకుండా ఇవి పాటించండి
సాత్విక ఆహారం తీసుకోండి.. మాంసం, మద్యం సేవించకుండా ఉండండి.
భోజనం చేయడానికి ముందు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి.
తియ్యటి పదార్థం దేవుడికి నైవేద్యంగా సమర్పించండి
అక్టోబర్ 20, 2025న బృహస్పతి గోచారం జీవితంలో చాలా మార్పులను తెస్తుంది. కెరీర్, ధనం, కుటుంబం , విద్య రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కర్కాటకం, కన్యా రాశి వారికి ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది, అయితే సింహ రాశి వారు సంయమనం వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. గురుదేవుడి అనుగ్రహం పొందడానికి గురువారం నాడు పూజలు, ఉపవాసాలు చేయండి.





















