Horoscope Today: ఈ రాశులవారు ఈ రోజు ఏ పని చేసినా విజయం వరిస్తుంది….
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
2021 ఆగస్టు 9 సోమవారం రాశిఫలాలు
మేషం
వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సమస్యలను తొలగించడానికి మీరు పెద్దల సలహాలు తీసుకోవచ్చు. పిల్లలతో సమయం గడపగలుగుతారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృషభం
మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు శుభసమయం. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. బయట ఆహారం తినొద్దు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు స్నేహితులు, బంధువులను కలుసే అవకాశం ఉంది.
మిథునం
మిథునరాశివారికి బాగా కలిసొచ్చే రోజుది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయండి. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళిక రూపొందించవచ్చు. ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు ఉండేవారు సమయాన్ని మార్చుకోండి...
కర్కాటక రాశి
ఈ రోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. సరైన సమయంలో కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్తగా చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు, పెద్దల సలహాలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వండి.
సింహం
ఆర్థిక పురోగతి కోసం ఈ రోజు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. కార్యాలయాల్లో ప్రశంసలు అందుకుంటారు. ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. ఇంటి పెద్దల ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. ఏ విషయంలోనూ నిరుత్సాహం వద్దు.
కన్య
నిరుద్యోగులకు శుభసమయం. ఉద్యోగస్తుల బాధ్యత పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇచ్చిన అప్పులు వసూలవుతాయి.
తులారాశి
బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. అధిక పని వల్ల అలసిపోతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెద్దల సలహాతో మీ పనులు కొంతవరకు పూర్తవుతాయి. స్నేహితులను కలుస్తారు.
వృశ్చికరాశి
ఈరోజు మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. మీ సహకారంతో కొందరి పనులు పూర్తవుతాయి. మీ పనులు ముందుకుసాగుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. బంధువులతో సమావేశం ఉండొచ్చు... మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ధనుస్సు
మీ పనులు పూర్తిచేయడంపై సోమరితనం వద్దు. కొత్త బాధ్యతని తీసుకుంటారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. మీరు ఓ శుభవార్త వింటారు.
మకరం
కోపం అధికంగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రోజంతా బిజీగా ఉంటారు. కుటుంబ సభ్యుల మాటలకు మానసికంగా గాయపడతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసేవారు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ సమయంలో దూషించే పదాలు వాడొద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కుంభం
మీరు మీ బాధ్యతను నెరవేర్చగలరు. బయటి ఆహారాన్ని తినొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తి ముందు వ్యక్తిగత చర్చ చేయవద్దు. బంధువులను కలుస్తారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సమస్యలు ఉండవచ్చు.
మీనం
కార్యాలయంలో సహోద్యోగులతో సామరస్యం ఉంటుంది. మీ పని ముందుకు సాగుతుంది. ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. రుణం మొత్తాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. కొత్త ఆర్థిక వనరులు వెతుక్కుంటారు. ఒత్తిడికి లోనుకావొద్దు..