Horoscope Today: జులై 29 గురువారం రాశిఫలాలు…. వృషభం, మిధునం, కన్య రాశివారు ఈ పని చేయకూడదు...
గమనిక: ఓ రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 29 గురువారం రాశిఫలాలు చూద్దాం…
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం :- ఈ రోజు మేషరాశివారు కుటుంబ సభ్యులతో సంతోష సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సహోద్యోగుల నుంచి సహకారం పొందుతారు.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల :- వృషభరాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్ లో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు కొత్త ఆదాయమార్గాలు వెతుక్కుంటారు. మీ కష్టానికి ఫలితం ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. వృషభరాశివారు వాహనం జాగ్రత్తగా నడపాలి…ప్రమాదాన్ని తెచ్చిపెట్టే పనులవైపు అస్సలు పోవద్దు…
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల :- మిధునరాశివారు అనవసరమైన ఖర్చులను నియంత్రించగలుగుతారు. కార్యాలయంలో సవాళ్లు ఉంటాయి. వ్యాపారులు లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరికీ అప్పివ్వవద్దు. అహంకారాన్ని ప్రదర్శించి వివాదాలు కొనితెచ్చుకోవద్దు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష :- కార్కాటక రాశివారు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయి. స్నేహితుల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా మరింత బలపడతారు. కొత్త ఉద్యోగఅవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి...
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- సింహరాశి వారు ఈరోజు దానకర్ణులుగా మారిపోతారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు కష్టపడాల్సిందే. మీ గత సంబంధాల గురంచి తీవ్రంగా ఆలోచిస్తారు.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల :- కన్యారాశివారికి ఒకరితో విభేధాలు పరిష్కారం అవుతాయి. జాగ్రత్తగా ఖర్చు చేయాలి. మీకు దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు వద్దు. కొన్ని కొత్త వ్యాపార ప్రణాళికల గురించి సమాచారాన్ని పొందుతారు. పిల్లల నుంచి ఆనందం పొందుతారు. చట్టపరమైన విషయంలో సహాయ సహకారాలు అందుతాయి.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :-
తులారాశి వారు జీవిత భాగస్వామితో సంతోష సమయాన్ని గడుపుతారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని పనులకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. అనుభవజ్ఞులైన కొంతమంది వ్యక్తులను కలిసిన తర్వాత మీ ఆలోచనల్లో సానుకూల మార్పు ఉంటుంది. వివాహం ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- వృశ్చిక రాశివారకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అపరిచితులకు సహాయం చేసేముందు కాస్త ఆలోచించండి. కష్టపడితేనే ఫలితం పొందగలరు. రోజంతా బిజీ బిజీగా ఉంటారు. మీ పనితీరు మారుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ధనస్సు రాశివారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపార పనులకు ఆటంకం కలుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సామాజిక సేవతో సంబంధం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులకు తోటివారితో వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- మకరాశి వారు ఈరోజంతా చికాకుగా ఉంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు...మీ పనిపై ప్రభావం చూపుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- చాలా రోజులుగా నిలిచిన ఓ పని ఈరోజు పూర్తవుతుంది. రుణాలు ఇవ్వొద్దు. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచిరోజు. అదృష్టం కలిసొచ్చినప్పటికీ మీ మనసులో ఆ సంతోషం ఉండదు. పెరిగిన ఖర్చులు కుటుంబలో వివాదాలు రేపుతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. అనవసర ఖర్చులు నియంత్రించండి.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- మీనరాశివారు ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. ఆర్థికంగా కలిసొచ్చే సమయం. మీరు పనిచేసే రంగంలో మెరుగవుతారు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం తగదు. మీకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది.