Horoscope Today 8th February 2025: ఈ రాశులవారికి ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 9 రాశిఫలాలు
మేష రాశి
మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో గందరగోళం ఉంటుంది. అనవసరమైన సమస్యలో ఇరుక్కునే ప్రమాదం ఉంది..అప్రమత్తంగా వ్యవహరించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృషభ రాశి
బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం మార్పుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. మీ ప్రతిభపై విశ్వాసం ఉంచండి. రిటైల్ వ్యాపారవేత్తలకు రోజు శుభప్రదమైనది.
మిథున రాశి
ఈ రోజు ఏదో నిరుత్సాహంలో ఉంటారు. పాత వ్యాధులు మళ్లీ బయటపడతాయి. అనుకోని ఖర్చులుంటాయి. విదేశీ వనరుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొన్ని సమస్యలున్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి.
Also Read: కుంభంలోకి గ్రహాల రాకుమారుడు.. బుధుడి సంచారం సమయంలో ఈ రాశులవారిదే రాజ్యం!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు ఇంట్లో శుభకార్యం నిర్వహణపై చర్చిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న వ్యాపారం చేసేవారు లాభపడతారు. మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు గొప్ప అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది.
సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. నూతన కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. చట్టపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామిపట్ల గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారికి వివాహ జీవితంపై అసంతృప్తి పెరుగుతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి సంతోషిస్తారు. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. గొప్ప వ్యక్తులతో మీ పరిచయం బలంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: భీష్మ ఏకాదశి ఎప్పుడు..ప్రాముఖ్యత ఏంటి - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏంటి!
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారి వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పెరుగుతాయి. నూతన పరిచయాలు, ప్రేమ వ్యవహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఖర్చులుంటాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి
వృశ్చిక రాశి
ఈ రోజు వ్యాపారంలో కొత్త మార్పులు చేయవద్దు..ముందుగా అనుకున్న ప్రణాళికలను అమలు చేయండి. ఉన్నత ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బావుంటుంది. కుటుంబంలో అంతా సంతోషంగా ఉంటారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఆసక్తికరమైన రోజు అవుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. సహోద్యోగుల ప్రవర్తనతో ఉద్యోగులు ఇబ్బంది పడతారు కానీ మీ లక్ష్యంపై దృష్టిసారిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి.
Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!
మకర రాశి
రోజు ఆత్మవిశ్వాసంతో కూడిన రోజు అవుతుంది. ప్రేమపక్షులు తమ కుటుంబ సభ్యులను వివాహం గురించి ఒప్పించడంలో విజయం సాధిస్తారు. వివాదాస్పద విషయాలలో రాజీ పడవచ్చు. మీడియా, రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది.
కుంభ రాశి
ఈ రోజు క్రమశిక్షణతో ఉండాలి. ఇంటి పెద్దలు సంతోషంగా ఉంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. పాత సమస్యల గురించి ఆందోళన ఉంటుంది. గొంతు సంబంధిత సమస్య వస్తుంది.
మీన రాశి
మీన రాశివారికి ఈ రోజు చాలా మంచిది. ఆస్తి వృద్ధి చేయడంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సంకల్పం ఆధారంగా పెద్ద ప్రాజెక్ట్ చేపడతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















