అన్వేషించండి

Budh Gochar 2025: కుంభంలోకి గ్రహాల రాకుమారుడు.. బుధుడి సంచారం సమయంలో ఈ రాశులవారిదే రాజ్యం!

Budh Gochar Rashifal 2025: మకర రాశిలో సంచరిస్తున్న బుధుడు...ఫిబ్రవరి 09 నుంచి కుంభంలో అడుగుపెడతాడు. ఫిబ్రవరి 28 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు..ఈ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉండబోతోంది...

Astrology: నవగ్రహాల్లో అత్యంత ఆలస్యంగా కదిలేది శనిగ్రహం అయితే..అత్యంత తొందరగా రాశి పరివర్తనం చెందే గ్రహం బుధుడు. మూడు వారాలు, నాలుగు వారాలు...ఒక్కోసారి రెండు వారాలకే రాశి మారిపోతుంచాడు. ఫిబ్రవరి 09 ఆదివారం సాయంత్రం 5 గంటల 11 నిముషాలకు మకరం నుంచి కుంభంలో అడుగుపెడతాడు బుధుడు. నెలాఖరువరకూ ఇదే రాశిలో ఉంటాడు.  గ్రహాల రాకుమారుడైన బుధుడు  కమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్, లాజిక్, మ్యాథమెటిక్స్ మరియు బిజినెస్ కి కారకుడు. మరి కుంబంలో బుధుడి ప్రభావం ఏ రాశిపై ఎలా ఉందంటే..
 
మేష రాశి

మీ రాశి నుంచి పదకొండో స్థానంలో ఉండే బుధుడు మీకు అన్నింటా విజయాన్నిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు వరకూ మీరు ఏ పని ప్రారంభించినా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్యమైన మార్పులొస్తాయి

వృషభ రాశి

మీ రాశి నుంచి పదో స్థానంలో సంచరిస్తున్న బుధుడు వృత్తి, ఉద్యోగాలలో మంచి ఫలితాలనిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ఎదురూచూస్తున్నవారి నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి, విద్య మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు.

Also Read: భీష్మ ఏకాదశి ఎప్పుడు..ప్రాముఖ్యత ఏంటి - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏంటి!

మిథున రాశి

మీ రాశినుంచి తొమ్మిదో స్థానంలో ఉండే బుధుడు మీ సౌకర్యాలను మెరుగుపరుస్తాడు. వ్యాపారంలో వృద్ధి సాధించేలా సహకరిస్తాడు. ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. 

కర్కాటక రాశి

మీ రాశి నుంచి ఎనిమిదో స్థానంలో ఉండే బుధుడు ఆకస్మిక ప్రయోజనాలను అందిస్తాడు. వృత్తి, ఉద్యోగాలలో ఉండే ఇబ్బందుల నుంచి గట్టెక్కేలా సహకరిస్తాడు

సింహ రాశి
 
కుంభంలో బుధుడి సంచారం మీ రాశి నుంచి ఏడో ఇంట ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్ధిక లాభం పొందుతారు, భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. 

కన్యా రాశి
 
కన్యా రాశి నుంచి ఆరో ఇంట సంచరిస్తోంది బుధుడు. ఈ సమయంలో మీరు అదృష్టానికి కేరాఫ్ లా మారుతారు. వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన మార్పులొస్తాయి. ఆదాయం పెరుగుతుంది. 

తులా రాశి

కుంభంలో బుధుడి సంచారం అంటే తులా నుంచి ఐదో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో డబ్బు ఆదాచేస్తారు. 

Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!

వృశ్చిక రాశి

నాలుగో ఇంట బుధుడి సంచారం మీ జీవితంలో కొన్ని సమస్యలు తీసుకొస్తుంది. మీ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. 

ధనస్సు రాశి

కుంభంలో బుధుడి సంచారం మీ రాశి నుంచి మూడో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో మీ కెరీర్లో వృద్ధి ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక వృద్ధి ఉంటుంది.  

మకర రాశి

మీ రాశి నుంచి రెండో స్థానంలో బుధుడి సంచారం మీ మాటతీరులో మాధుర్యం నింపుతుంది. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. స్నేహితులు , సన్నిహితులు మీతో సంతోషంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి

కుంభ రాశి

మీ రాశిలోనే బుధుడి సంచారం ఉండడం వల్ల ఫిబ్రవరి నెలాఖరు వరకూ మీరు ఆర్థిక ప్రయోజనాలుంటాయి. కెరీర్లో లక్ష్యాలు సాధించేందుకు మీరు వేసే అడుగులు సక్సెస్ అవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు

మీన రాశి
 
మీ రాశి నుంచి పన్నెండో స్థానంలో బుధుడి సంచారం మీకు సకల కార్యాల్లో విజయాన్ని అందిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు వరకూ మీరు ప్రారంభించిన ఏ పని అయినా సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది.

Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget