ఆగష్టు 25 రాశిఫలాలు, ఈ రాశులవారు సాధించిన విజయంతో సంతృప్తి చెందలేరు!
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 25th
మేష రాశి
ఈ రాశి వ్యాపారులు పెద్ద పెద్ద మార్పులు చేర్పులు ఇప్పట్లో చేయకపోవడమే మంచిది. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. అపార్థాల కారణంగా మీ వివాహ బంధంలో చీలక రావొచ్చు జాగ్రత్తపడాలి. భావోద్వేగాలకు లోనవుతూ ముఖ్యమైన విషయాలను అందరి ముందు పంచుకోకండి.
వృషభ రాశి
ఈ రోజు అతిథులను కలుస్తారు. మీ దినచర్యలో యోగా లేదా వ్యాయామం చేర్చుకోవడం మంచిది. వైవాహిక జీవితం బావుంటుంది. ఆస్తికి సంబంధించి నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. పబ్లిక్ రిలేషన్స్ పరిధి పెరుగుతుంది.
మిథున రాశి
ఈ రాశివారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. మీరు సాధించిన విజయాలతో మీరు సంతృప్తి చెందలేరు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది.
Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు!
కర్కాటక రాశి
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఇరుగుపొరుగువారితో మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. మాట తూలొద్దు.నిరుద్యోగులు తమ కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. స్నేహితులను కలుస్తారు. సోషల్ మీడియాలో అత్సుత్సాహం తగ్గించుకోవడం మంచిది. న్యాయపరమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
సింహ రాశి
ఈ రాశివారు ఉద్యోగం, వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులను అతిగా నమ్మొద్దు. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. మీరు మీ ప్రతిష్ట గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. వ్యాపారంలో లాభం ఉంటుంది కానీ ఒత్తిడి కూడా పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రాశివారు ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలకు మంచి ప్రశంసలు లభిస్తాయి. శత్రువులు బలహీనపడతారు.
తులా రాశి
ఈ రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు మరోసారి ఆలోచించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. జీవిత భాగస్వామి సలహాలు పరిగణలోకి తీసుకుంటే మంచిది. రాజకీయాలతో సంబంధం ఉన్నవ్యక్తులు గౌరవం పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఏధైనా పెద్ద పనిని తలపెట్టే ముందు మరోసారి ఆలోచించడం మంచిది. ప్లాన్ ప్రకారం ముందుకు సాగితే ప్రయోజనం ఉంటుంది. వివాదాలకు దరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు
Also Read: శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు సమయానికి పూర్తికావడం కష్టమే. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందడం కష్టం. నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మీ జీవిత భాగస్వా మి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు.
మకర రాశి
ఈ రాశివారు ఈ రోజు వేసుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయి. దాంపత్య బంధం బావుంటుంది. ఉద్యోగులు గౌరవం పొందుతారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కళలతో సంబంధం ఉన్న వ్యక్తులు కీర్తి అందుకుంటారు.
కుంభ రాశి
ఈ రాశి విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. మీ చుట్టూ సానుకూల శక్తి ఉంటుంది. వ్యాపారంలో నూతన మార్పులు సాధ్యం అవుతాయి. ఇంటా బయటా మీ ఆధిక్యత పెరుగుతుంది.
మీన రాశి
ఈ రాశి ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది కానీ చేయాల్సిన పనిని తెలివిగా పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. న్యాయపరమైన విషయాలు పరిష్కారం అవుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. అనియంత్రిత ఆహారం విషయంలో ఈ రాశివారు అప్రమత్తంగా ఉండాలి.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
వరలక్ష్మీ వ్రతం ప్రారంభంలో గణపతి పూజకోసం ఈ లింక్ క్లిక్ చేయండి
గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....Part2