Image Credit: Pixabay
Horoscope Today 12th June 2023: జూన్ 12 మీ రాశిఫలితాలు
మేష రాశి
ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. సామాజికంగా కీర్తి పొందుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. అవివాహిత వ్యక్తులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఏ విషయంలోనైనా వాగ్వాదం రావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి..ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
వృషభ రాశి
నిన్నటి వరకూ వెంటాడిన చింత కొంత తొలగిపోతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు పనికి ప్రశంసలు అందుకుంటారు. అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. సామాజిక రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది.
మిథున రాశి
ఈ రోజు మిథునరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార భాగస్వామితో విభేదాలు రావచ్చు. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. పిల్లల గురించి చింతలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత మీ మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు ఉంటాయి.
Also Read: వారఫలాలు (జూన్ 12-18): ఈ వారం 3 రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆ రాశులవారికి వ్యక్తిగత సమస్యలు!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. భగవంతుని నామాన్ని స్మరించండి. ఏకాగ్రతతో పనిచేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. డబ్బు సమస్య ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారితో వాదించకూడదు. విదేశాల నుంచి బంధువులకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు.
సింహ రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. స్నేహితులు, ప్రియమైనవారితో సమయం స్పెండ్ చేస్తారు. పర్యాటక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. మానసికంగా మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. కోపం పెరుగుతుంది. ఏ పనీ చేయాలని అనిపించదు. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి.
కన్యా రాశి
ఈ రోజు మీకు శుభప్రదమైన ఫలవంతమైన రోజు. తలపెట్టిన పనిలో విజయం సాధించడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీ కీర్తి పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. దేనికీ ఎక్కువ ఎమోషనల్ అవకండి. వ్యాపారంలో భాగస్వాముల నుంచి లాభాలు పొందుతారు.
తులా రాశి
రచన, సాహిత్య కార్యకలాపాలకు అనుకూలమైన రోజు. ఏదైనా చర్చలో పాల్గొనవచ్చు. ఉద్యోగస్తులు తమ ప్రతిభ వల్ల కొన్ని మంచి పనులు చేయగలుగుతారు. మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి
ఏ విషయంలోనూ మెండిగా ఉండొద్దు. మీ భావోద్వేగాలను నియంత్రించండి. ఆర్థిక విషయాలలో లాభాన్ని ఆశించవచ్చు. ఈ రాశి స్త్రీలు సౌందర్య సాధనాలకోసం ఖర్చు చేస్తారు. తల్లినుంచి ప్రయోజనం పొందుతారు. మధ్యాహ్నం తర్వాత ఆలోచనల్లో త్వరగా మార్పు వస్తుంది. కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు. ఆరోగ్యం జాగ్రత్త.
ధనుస్సు రాశి,
మీ మనసులోంచి కొన్ని చింతలు తొలగిపోవడం వల్ల తేలిగ్గా ఫీలవుతారు. కుటుంబంలో ప్రత్యేక చర్చలుజరగొచ్చు. మిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రత్యర్థిపై విజయం సాధిస్తారు. భూమి, ఇల్లు, వాహనం మొదలైన విషయాల్లో వ్యవహారాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త.
మకర రాశి
ఈ రోజు మీ మనసంతా ఆధ్యాత్మిక ఆలోచనలపై ఉంటుంది. ఖర్చు చేస్తారు కానీ కుటుంబ వాతావరణం మాత్రం సంతోషంగా ఉండదు. వివాదాలు జరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పనిచేయాలని అనిపించదు. మధ్యాహ్నం తర్వాత మీ మనసులో చింతలు తొలగిపోతాయి. స్నేహితులు బంధువులతో అర్థవంతమైన సమావేశం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది.
Also Read: మీ తీరు ఎలా ఉంటుందో మీ రాశి చెప్పేస్తుంది!
కుంభ రాశి
ఈ రోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ చూపిస్తారు. ప్రతికూల భావాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. శారీరక ఉల్లాసం కలగి ఉంటారు. విద్యార్థులకు చదవడం, రాయడంలో అనుకూలత ఉంటుంది. గృహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది.
మీన రాశి
రేపు డబ్బును డీల్ చేసేటప్పుడు లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పనిలో తొందరపడటం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాటలుపై సంయమనం పాటించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ వాతావరణంలో ఆనందం ఉంటుంది.
Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!
Karthika Masam 2023:ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!
Ashtadasa Maha Puranas: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!
Horoscope Today November 28, 2023: ఈ రాశివారికి ఆదాయం, పనిభారం రెండూ పెరుగుతాయి - నవంబరు 28 రాశిఫలాలు
Kartika Purnima 2023: కార్తీక పౌర్ణమి పై కన్ఫ్యూజన్ వద్దు - ఏ రోజంటే!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>