అన్వేషించండి

Horoscope Today February 20, 2024: ఈ రాశులవారు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి

Horoscope 20 February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today - Astrological prediction for February 20, 2024

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు పనిలో సవాళ్లు ఎదురవుతాయి..దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. నూతన పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చెల్లింపులకు సంబంధించిన సమస్యలు కొందరు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

మీ జీవితంలో కొత్త వ్యక్తిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. వృత్తి జీవితంలో మీరు నూతన ఉత్సాహంతో ఉంటారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు మంచి అవకాశం వస్తుంది. గడువులోగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.  ఆదాయ వనరులు పెరుగుతాయి. 

మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రాశికి చెందిన ఒంటరి వ్యక్తులు  ప్రేమలో పడతారు. వైవాహిక జీవితం బావుంటుంది. సంభాషణ ద్వారా మీ భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ కలల గురించి మీ భాగస్వామితో పంచుకోండి. పరస్పర సమన్వయంతో మీరిద్దరూ మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చు. కార్యాలయంలో చాలా ఉత్తేజకరమైన మార్పులు ఉంటాయి. సహోద్యోగులను,  ఉన్నతాధికారులను ఆకట్టుకోవడానికి మీ మేధో నైపుణ్యాలు మరియు వినూత్న ఆలోచనలను ఉపయోగించండి. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునేటప్పుడు మీపై నమ్మకం ఉంచుకోండి.

Also Read: మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి - ఉన్నాయా మరి! - చాణక్యనీతి!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  
 
ప్రేమకు సంబంధించిన సమస్యలను సానుకూలతతో పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీరు సంబంధాలలో చాలా మార్పులను చూస్తారు. ఇంటర్యూలకు హాజరయ్యేవారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి.

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. వృత్తి జీవితంలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. కార్యాలయంలోని సవాళ్లు  అడ్డంకులను అధిగమించడానికి మీపై విశ్వాసం కలిగి ఉండండి. పరిస్థితికి తగ్గట్టుగా ఉండటం మీ ప్రత్యేక లక్షణం. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. భవిష్యత్ లో ఆర్థికంగా బలపడేందుకు మంచి ప్రణాళికలు వేసుకోవాలి. 

Also Read:  వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

కొన్ని దూర సంబంధాలలో విభేదాలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం బావుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూలలో విడయం సాధిస్తారు. వ్యాపారులు కొత్త ఆలోచనలు అమలు చేస్తారు.  ఈ వారం మీ ఆర్థిక అంశం బలంగా ఉంటుంది . ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు డబ్బు పరంగా చాలా అదృష్టవంతులు అవుతారు.  ఆదాయం పెరుగుతుంది. జీవనశైలి మెరుగుపడుతుంది.  వ్యాపారవేత్తలు ఆర్థిక నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు తప్పు అని నిరూపితమవుతాయి. 

తులా రాశి (Libra Horoscope Today) 
 
మీ జీవితంలోకి కొత్త వ్యక్తులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మనసులో మాటని వ్యక్తం చేసేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశారజనకంగా ఉంటుంది.  మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు.  

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 
 
మీ ప్రేమ జీవితం ప్రేమ, సంతోషంతో నిండి ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. మీరు కార్యాలయంలో మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ ఈ మార్పులు పురోగతికి మార్గాలను నిర్ధారిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కార్యకలాపాలలో పాల్గొనండి. ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉన్న కొత్త అవకాశాల కోసం చూడండి.

Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రాశివారికి ఓర్పు చాలా అవసరం. సంభాషణ సమయంలో కోపం ప్రదర్శించవద్దు...ఆ ఫలితంగా సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగులు తెలివిగా పనిచేయాలి..కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. కార్యాలయంలో గాసిప్ ల గురించి చర్చించవద్దు. వ్యాపారులు భాగస్వాములతో సమస్యలు ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారు ఈ రోజు ఆరోగ్యం , డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు వృత్తి జీవితంలో పురోగతిని పొందుతారు. అత్యవస పనులను జాగ్రత్తగా పూర్తిచేయండి. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి

Also Read: ఈ వారం ఈ రాశులవారి ఆరోగ్యం, ఆదాయం అద్భుతం- ఫిబ్రవరి 19 నుంచి 25 వారఫలాలు!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

మీ ప్రతిభను ప్రదర్శించడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి మరియు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఇది సమయం. మీపై విశ్వాసం కలిగి ఉండండి.   ఊహించని అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి. ఈ రోజు మీకు ఆర్థిక పురోగతి మార్గంలో మార్గనిర్దేశం చేస్తుంది. మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యకలాపాలలో పాల్గొనండి. ధ్యానం చేయండి. ఆరోగ్యం పై శ్రద్ధవహించండి.

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ పర్సన్‌లు ఈ రోజు ఓ పనిపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు విదేశాలకు వెళ్లాల్సి రావొచ్చు. కార్యాలయ రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి..వాటికి దూరంగా ఉండేలా చూసుకోవాలి. బంగారం, వజ్రాల మీద పెట్టుబడులకు మంచి రోజు. ఈ రాశివారు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?

వీడియోలు

1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam
Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Why Mouth Taste Bitter During Fever: జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
జ్వరం వచ్చిన తర్వాత నోరు ఎందుకు చేదుగా మారుతుంది?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Embed widget