Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
వ్యాపారస్తులకు కలిసొచ్చే రోజుది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఏదో ఆందోళనలో ఉంటారు. ఇతరుల మాటలు విని ఏ పనీ చేయవద్దు. చట్టపరమైన అడ్డంకి తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త.
వృషభం
స్నేహితులను కలవడానికి మీకు సమయం లభిస్తుంది. విలువైన వస్తువులపై నిర్లక్షం వద్దు. కొత్త ప్రణాళికలు వేస్తారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు మరింత శ్రమించాలి. ఆదాయం పెరుగుతుంది. సామాజిక సేవ చేసేందుకు ఆసక్తి చూపుతారు. సోమరితనం వద్దు.
మిథునం
ఆర్థిక పరిస్థికి మెరుగుపడుతుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. శారీర నొప్పులు బాధపెడతాయి. ఏదో తెలియని భయం వెంటాడుతుంది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
Also Read: ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...
కర్కాటకం
సామాజిక సేవలో పాల్గొంటారు. వాహనాలు, యంత్రాల వాడకంలో జాగ్రత్తగా ఉండండి. పని చేయాలని అనిపించదు. భాగస్వాములతో విభేదాలు ఉండొచ్చు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనం దుర్వినియోగానికి దూరంగా ఉండండి.
సింహం
ఏ పనిపై ప్రయాణం చేయాల్సి వస్తుందో ఆ పని సక్సెస్ అవుతుంది. తొందరపాటు , అనవసర వాదనలు వద్దు. ఈరోజు తొందరగా అలసిపోతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మితకపై ఆసక్తి ఉంటుంది. ఆనందంగా ఉంటారు. కెరీర్ పరంగా ఉన్న అడ్డంకి తొలగిపోతుంది.
కన్య
ఉద్యోగస్తులు ప్రమోషన్, జీతానికి సంబంధించి శుభవార్త వింటారు. ప్రభుత్వ పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. పెద్ద పెద్ద డీల్స్ లాభాలనిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వివాదాలకు దూరంగా ఉండండి.
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
తుల
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అనవసర పనులకు సమయం వృధా అవుతుంది. దుర్వార్తలు వింటారు. పని చేయాలని అనిపించదు. లావాదేవీ విషయంలో తొందరపాటు వద్దు. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం
ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. పూర్వీకుల ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. ఇతరుల పనిలో, వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడి దూరమవుతుంది.
ధనుస్సు
ఈ రోజంతా గందరగోళంగా ఉంటారు. విలువైన వస్తువులను జాగ్రత్తచేయండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక పురోగతి కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్నేహితులకు సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
మకరం
ఈరోజు మంచి రోజు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. అతిథులు ఇంటికి రావొచ్చు. అనుకోని వ్యయం ఉంటుంది. రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి. మీరు శత్రువులపై పైచేయి సాధిస్తారు. అనవసరమైన ఒత్తిడి తీసుకోకండి. రిస్క్ తీసుకోవడానికి ధైర్యం తెచ్చుకోండి.
కుంభం
ఈరోజు మీరు శుభవార్త వింటారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఇంటా-బయటా గౌరవం లభిస్తుంది. కొత్త ఖర్చులు తలెత్తుతాయి. తీసుకున్న అప్పులు తీరుస్తారు. పాత వ్యాధి తిరిగబెట్టొచ్చు. సందర్భం లేకపోయినా కల్పించుకుని మాట్లాడవద్దు. బాగా ఒత్తిడికి లోనవుతారు. అత్యవసర పనులు ఆలస్యమవుతాయి.
మీనం
మీకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఏదైనా వేడుకలో పాల్గొంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు కలిసొచ్చేసమయం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. తొందరపాటు వద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి