X

Horoscope Today:ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు,ఈ ఐదు రాశులవారికి అద్భుతంగా ఉంటుంది, ఏ రాశుల వారికి ఎలా ఉందంటే..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 సెప్టెంబరు 29 బుధవారం రాశిఫలాలు


మేషం: ఈరోజు మీరు శుభవార్త వింటారు. బాధ్యత పెరుగుతుంది.  ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం తెలుస్తుంది. డబ్బుకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. 
వృషభం:  ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చట్టపరమైన విషయాలు వేగవంతం అవుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం ఉండొచ్చు. బంధువులను కలుస్తారు. శత్రువులు ఇబ్బందులకు గురిచేస్తారు. ఆలోచించి  మాట్లాడండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ఓ సమస్య  నుంచి బయటపడతారు.  వ్యాపారం బాగానే ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
మిథునం: ఈ రోజు మీకు విజయవంతమైన రోజు అవుతుంది. చాలారోజులుగా చేతికందాల్సిన మొత్తం అందుతుంది.  స్నేహితుడి సహాయంతో సమస్య పరిష్కారమవుతుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పని పట్ల అలసత్వం వద్దు. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఈ రోజుకి విరమించుకోండి. ఒత్తిడి దూరమవుతుంది.
కర్కాటకం: మీ ఆలోచనల్లో సానుకూలత తీసుకురావడానికి ప్రయత్నించండి.  కోపం పెరుగుతుంది.  ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోలేరు. కొన్ని విషయాలకు సంబంధించి కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. ఇంటి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామి సలహా అనుసరించండి.  మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం: ఈ రోజు అద్భుతమైన రోజు. సామాజిక, కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.  ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది.  అధిక పని ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. యువత ఉద్యోగాలు పొందొచ్చు.  వ్యాపారస్తులకు శుభసమయం.
కన్య: టెన్షన్ తగ్గుతుంది.  కుటుంబంతో సామరస్యం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న  పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో వివాదం వద్దు వారి సలహాను స్వీకరించండి. ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.  అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రమాదంతో కూడిన పనులు చేయవద్దు.
తుల: ఈ రోజు మీకు మంచి రోజు. పాత స్నేహితులను కలుస్తారు. శుభవార్త వింటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి.  ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు.  అనవసరంగా ఖర్చు చేయవద్దు.
వృశ్చికం: ఈ రోజంతా మీకు గందరగోళంగా ఉంటుంది.  శారీరక నొప్పితో ఇబ్బంది పడతారు. వ్యాపార పరిస్థితులు నెమ్మదిస్తాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. తొందరపడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తవచ్చు. చట్టపరమైన విషయాల్లో కొంత సమస్య ఉండవచ్చు. ముఖ్యమైన ఖర్చులు మాత్రమే చేయండి. బడ్జెట్ ప్రభావితం కావచ్చు.                                                                                                ధనుస్సు: ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. వైవాహిక జీవితం బావుంటుంది. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా చేతికందాల్సిన మొత్తాన్ని పొందుతారు. సామాజిక స్థితి  బావుంటుంది. ఈ రోజు మీకు గౌరవం లభిస్తుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించగలుగుతారు. అపరిచితులతో జాగ్రత్త. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.                                                                                                                                                                                                                                                                                                                మకరం: ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త.  ఈరోజు మీరు ఓ సమస్యని పరిష్కరించగలరు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కలిసొస్తుంది. కొత్త వ్యక్తులు కలుస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. రాత్రి ఆలస్యంగా మేల్కొనవద్దు.
కుంభం: ఈ రోజు మీరు సానుకూలంగా ఉంటారు. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. స్నేహితులకు అండగా నిలబడతారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకండి. కోర్టు కేసులు కొనసాగుతాయి. మీ రోజు సాధారణంగా ఉంటుంది. 
మీనం: ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. దినచర్యలో మార్పు ఉంటుంది. టెన్షన్ తగ్గినప్పటికీ ఏదైనా విషయంలో గందరగోళం ఉంటుంది.  భార్యాభర్తల మధ్య వివాదాలున్నాయి.  ఆర్థిక సమస్యలు పరిష్కారమవడానికి సమయం పడుతుంది. స్నేహితుల సహాయంతో మీ పని పూర్తవుతుంది. ఒకరి మాటలు బాధ కలిగించవచ్చు. భూమి లేదా ఇంటికి సంబంధించి పెట్టుబడి పెట్టొచ్చు.


Also read: ఈ వారం ఈ మూడు రాశులవారు సక్సెస్ అవుతారు. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండండి ,మిగిలిన రాశులవారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..


Also Read: రేయింబవళ్లు శ్రమించినా.. నేతన్నలకు తప్పని ఆందోళన


Also Read: వామ్మో.. వానర సైన్యం.. హడలెత్తుతోన్న రైతులు, ఎందుకంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 29 September 2021

సంబంధిత కథనాలు

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 26 October 2021: ఈ రోజు ఈ రాశుల వారికి ఏం చేసినా కలిసొస్తుంది, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 25 October 2021: ఈ రాశుల ప్రేమికులకు మంచి రోజు, ఈ రాశుల వారు చాలా సంతోషంగా ఉంటారు … మీరు అందులో ఉన్నారా..!

Horoscope Today 25 October 2021: ఈ రాశుల ప్రేమికులకు మంచి రోజు, ఈ రాశుల వారు చాలా సంతోషంగా ఉంటారు … మీరు అందులో ఉన్నారా..!

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 24 October 2021: ఈరోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు .. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today 23 October 2021: ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు...మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today:ఈ ఐదు రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే, వారు అప్రమత్తంగా ఉండాలి.. మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి

SA vs WI, Match Highlights: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ మళ్లీ డిఫీట్‌! సఫారీల చేతిలో కరీబియన్ల ఓటమి