News
News
వీడియోలు ఆటలు
X

Horoscope Today: ఈ రోజు ఈ రాశులవారి ఒత్తిడి తొలగిపోతుంది, వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి..ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దాం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 
Share:

2021 సెప్టెంబరు 24 శుక్రవారం రాశిఫలాలు

మేషం: ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కెరీర్లో పురోగతి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కుటుంబం లేదా బంధువులతో వివాదాలు తలెత్తవచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. వ్యాపారం పెరుగుతుంది. ఏదో తెలియని భయం ఉంటుంది. స్తిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు అలసిపోయినట్టు అనిపిస్తుంది.

వృషభం: వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళిక రూపొందిస్తారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. చాలాకాలంగా నిలిచిన పనులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంటాయి. మీ బాధ్యత నెరవేర్చేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి. ఆశించిన విధంగా ఆదాయం పెరుగుతుంది. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. ఓ పనిపై చేసిన ప్రయాణం విజయవంతం అవుతుంది. శారీరక నొప్పి ఉండవచ్చు.

మిథునం: ఏదైనా పనికి సంబంధించిన ఆందోళన తొలగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపడకండి. శత్రుత్వం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పని మీద దృష్టి పెట్టండి. ఊహించని ఖర్చులు చేస్తారు. అప్పులు తీసుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధి బాధపెడుతుంది. అంచనాలు ఆలస్యం కావచ్చు.ఉద్యోగస్తులు ప్రయోజనం పొందుతారు.

Also Read: ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు

కర్కాటకం: భౌతిక వనరుల పెంపుపై వ్యయం ఉంటుంది. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. వ్యాపారంలో పెరుగుదలతో సంతృప్తి ఉంటుంది. ఆఫీసులో బాధ్యత పెరుగుతుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. మీరు ఉత్సాహంతో పని చేయవచ్చు. ఎవరి మాటల్లోనూ జోక్యం చేసుకోకండి. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. రిస్క్ తీసుకోకండి. కొత్త ఉద్యోగం ప్రారంభించవచ్చు.

సింహం: పెట్టుబడి పెట్టడానికి సమయం లేదు. ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు, ఓపికపట్టండి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు, యంత్రాల వినియోగించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రమాదంతో కూడిన పనిని జాగ్రత్తగా చేయండి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి. పనిలో వేగం తగ్గుతుంది. విద్యార్థుల ఆందోళనలు తొలగిపోతాయి.

కన్య: ఏదో తెలియని అడ్డంకి కారణంగా మీ పనులు పూర్తకావు. పెట్టుబడి పెట్టే ఆలోచనకు ఈ రోజు దూరంగా ఉండండి. వ్యాపారం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఒళ్లు నొప్పులతో బాధపడతారు. వ్యాపారం మందగిస్తుంది. ఉన్నత అధికారుల ప్రవర్తనతో మీరు అసంతృప్తిగా ఉంటారు. కుటుంబంలో కలహాలు ఉండవచ్చు.

Alos Read: ఉదయం బాలిక రూపంలో మధ్యాహ్నం యువతిగా.. సాయంత్రం వృద్ధురాలిగా కనిపించే అమ్మవారు

తుల: ఏ పనిపై ప్రయాణం చేశారో ఆ పని సక్సెస్ ఫుల్ గా పూర్తవుతుంది. కొత్త ఆదాయ వనరులు  వెతుక్కుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తొందరపాటుతో తప్పు చేయవద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. డబ్బు సంబంధిత వివాదాల్లో చిక్కకునే అవకాశం ఉంది జాగ్రత్త.

వృశ్చికం: మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. స్నేహితులకు సహాయం చేయడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు  ఉన్నత అధికారుల మెప్పు పొందుతారు. అపరిచితులతో ఎక్కువ మాటలొద్దు.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.

ధనుస్సు: మీ దినచర్యలో మార్పు ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. పొదుపు పథకంలో పెట్టుబడి శుభప్రదం అవుతుంది. మతపరమైన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి. వ్యాపారాభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి.

Also Read:అజీత్ ‘వాలిమై’ గ్లింప్సెస్.. ‘గెట్ రెడీ ఫర్ ది గేమ్’ అంటూ కార్తికేయ ఛాలెంజ్

మకరం: ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అసభ్యకరమైన పదాలను ఉపయోగించడం మానుకోండి. పాత వ్యాధి తిరిగి రావచ్చు. వ్యాపారంపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా కొత్త వ్యయం కారణంగా రిస్క్ తీసుకోకండి, బడ్జెట్ చెడిపోతుంది. బంధువు నుంచి విచారకరమైన వార్తలు అందుతాయి. పిల్లలు సక్సెస్ అవుతారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.

కుంభం:  మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. అతిథులు ఇంటికి వస్తారు. రిస్క్ తీసుకుని ముందడుగు వేస్తే సక్సెస్ అవుతారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు. చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి.

మీనం: మీన రాశివారు ఈ రోజు కోర్టు సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. కార్యాలయంలో ఎవరితోనైనా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

Also Read: ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ వచ్చేసింది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

Published at : 24 Sep 2021 06:19 AM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces 2Horoscope Today Horoscope Today 24 September 2021

సంబంధిత కథనాలు

Mysterious Bijli Mahadev  : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Mysterious Bijli Mahadev : పిడుగుపాటుకి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కుంటుంది, అదే అక్కడి విశిష్టత!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

Budh Gochar 2023: వృషభ రాశిలోకి బుధుడు, ఈ ప్రభావం 12 రాశులపై ఎలా ఉంటుందంటే!

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

మే 7 రాశిఫలాలు, మంత్ర-తంత్ర-రహస్య అధ్యయనాల పట్ల ఈ రాశివారికి ఆసక్తి పెరుగుతుంది!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

టాప్ స్టోరీస్

Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !

Lokesh Rayalaseema Declaration :  రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే  రత్నాల సీమే !

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

కోలీవుడ్‌ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్

Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!

Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!