మార్చి 5 రాశిఫలాలు, ఈ రాశివారి జీవితంలో మంచిరోజులొస్తాయి
Rasi Phalalu Today 5th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీ ప్రణాళికలు , ఆలోచనలను సమన్వయం చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటారు. ఒకరి కోసం చేసిన సహాయం మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. కుటుంబం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు లభిస్తాయి. పనుల్లో టంకాలు ఎదురవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
మిథున రాశి
ఈ రోజు కొత్త వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని చేసే ముందు పెద్దల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సంతానం చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Also Read: మార్చి నెలలో ఈ రాశులవారికి వ్యవహార జయం, ఆర్థిక లాభం
కర్కాటక రాశి
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గుర్తింపు ఈరోజు పొందుతారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతృప్తికరమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆహారంపై శ్రద్ధ వహించండి.
సింహ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ ఆలోచనా అవగాహన అభివృద్ధి చెందుతుంది. అనుకున్న పనిని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. మీ ప్రణాళికలు ఫలిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు వ్యాపారంలో లాభాలు పొందుతారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వారి వారి పనులపై దృష్టిసారించాలి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
తులా రాశి
ఈ రోజు పనిలో ఒత్తిడి ఉంటుంది కానీ అనుకున్న పనువు పూర్తిచేస్తారు. కొత్త ప్రణాళికలు అమలుచేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త రోజులు వస్తాయి.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశివారి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండొచ్చు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
Also Read: 2023 మార్చినెల రాశిఫలాలు, అపనిందలు, ఆకస్మిక ప్రమాదాలు - మార్చిలో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక లాభాలుంటాయి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో పరస్పర సామరస్యం నెలకొంటుంది.ఆఫీసులో పనులు పూర్తి చేయగలుగుతారు.
మకర రాశి
అనవసర వివాదాలకు దూరంగా ఉండి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు.
కుంభ రాశి
ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. కార్యాలయంలో పనిభారం పడుతుంది. ఈరోజు తొందరగా అలసిపోతారు, మానసికంగా ఒత్తిడికి గురవుతారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు పనిని వాయిదా వేయవద్దు. పనులను వాయిదా వేయవద్దు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంతో కలసి శుభకార్యానికి హాజరవుతారు.