Horoscope Today 4th October 2022: ఈ రాశులవారికి విజయం, అభయం - అక్టోబరు 4 రాశిఫలాలు
Horoscope Today 4th October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 4th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారు భాగస్వామ్యంతో వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు స్నేహితుడి సహకారంతో పూర్తవుతుంది. కానీ కొంతమంది స్నేహితులు మీకు శత్రువులుగా కూడా మారవచ్చు. మనసులో ఉన్న కొన్ని గందరగోళాలు తగ్గించుకోవడం మంచిది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులు మీ సలహాలు మరియు పనిప్రాంతంలో మీ సలహాలు స్వాగతించబడతాయి.
వృషభ రాశి
ఈ రోజు మీరు మీ తోబుట్టువులతో కొనసాగుతున్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుంది.వివేకం , విచక్షణతో ఓ నిర్ణయం తీసుకుంటే, అది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓ వ్యక్తికారణంగా కార్యాలయంలో కొంత ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు మంచి సమయం. విద్యార్థులు ఆర్థిక ప్రయోజనం పొందుతారు.
మిథున రాశి
ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు హడావుడి పడొద్దు. పని రంగంలో ఏదైనా పొరపాటు ఈ రోజు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఎక్కువ డబ్బు పెట్టొద్దు. మీ చుట్టూ ఉన్న ఎవరికైనా సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే, ఖచ్చితంగా ఆ పని చేయండి..ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ ఇల్లు ,ఉద్యోగంలో సాధారణ వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి
వ్యక్తులు ఈ రోజు కొత్త ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు తమ జూనియర్ల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీ మాట్లాడే విధానాన్ని బట్టి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఏదైనా విషయంలో కోపంగా ఉన్నప్పటికీ కాస్త ఆలోచించడం మంచిది..ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తూలొద్దు. ఖాళీగా టైమ్ పాస్ చేయడం కన్నా ఆగిపోయిన మీ పనులు పూర్తిచేయడం మంచిది.
Also Read: శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు - మహిషాసుర మర్థినిగా అమ్మవారి దర్శనం
సింహ రాశి
మీకు అదృష్టం కలిసొస్తుంది. ఏ పని మొదలెట్టినా సక్సెస్ అవుతారు. చేయాలనుకున్న పనిని సక్రమంగా చేయండి. ఉద్యోగంతో పాటు ఏవైనా అదనపు పనులు చేయాలి అనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. మీ కిందవారికి కొన్ని బాధ్యతలు అప్పగించవచ్చు. మీరు తలపెట్టే పనులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.
కన్యా రాశి
ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో గొడవ పడితే అంత తొందరగా సమసిపోదు. అందుకే మాటలద్వారా సమస్య పరిష్కరించుకోవాలి. కుటుంబంలో వ్యక్తులు మీ నుంచి ఆర్థిక సహకారం పొందుతారు. మీ మనస్సులో ఏముందో తల్లికి చెప్పండి...నెరవేరుతుంది. తోబుట్టువుల వివాహానికి ఏవైనా అడ్డంకులు ఎదురైతే ఈ రోజు అది కూడా తొలగిపోతుంది.
తులా రాశి
ఈ రోజు అధిక పని కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేరు. తొందరగా అలసిపోతారు, బలహీనంగా అనిపిస్తుంది. చట్టపరమైన విషయంలో చర్చ కారణంగా మీరు కొంత కలత చెందుతారు. అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయంతో మీ సమస్య తీరిపోతుంది. ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
Also Read: మీ బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు చెప్పేయండిలా!
వృశ్చిక రాశి
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామికి హడావుడిగా ప్రామిస్ చేయకండి..ఆ తర్వాత ఇబ్బంది పడతారు. స్థిరమైన ఆదాయం కారణంగా పెరుగుతున్న ఖర్చుల్లో కొన్నింటిని నియంత్రించాల్సి ఉంటుంది లేదంటే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి.పిల్లలు ఏది అడిగినా నెరవేరుస్తారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు సానుకూల ఫలితాలున్నాయి. అత్యాశగల వ్యక్తి మాటలు వినడం వల్ల మీ డబ్బును తప్పుడు మార్గంలో పెడతారు. మీ మనస్సులో కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీ కుటుంబ విషయాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు.
మకర రాశి
మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టండి. కొత్తగా ఏ పనులు ఈ రోజు తలపెట్టకపోవడం మంచిది. రోజంతా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు మంచి రోజు. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి
ఈ రోజు కుటుంబ జీవితాన్ని గడిపేవారికి మంచి రోజు అవుతుంది. మీరు చేపట్టిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. కుటుంబంలోని వాతావరణంతో మీరు సంతోషంగా ఉంటారు, ఒత్తిడి కూడా కొద్దిగా తగ్గుతుంది. మీరు ఏం మాట్లాడినా అపార్థం చేసుకునేవారున్నారు జాగ్రత్త. కంటి సంబంధిత సమస్య ఉన్నట్లయితే నిర్లక్ష్యంగా ఉండొద్దు.
మీన రాశి
ఏదైనా ప్రమాదకరమైన పనిలో వేలుపెట్టకుండా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సీనియర్ సభ్యుల సహాయం తీసుకోండి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతారు. వేరొకరి విషయంలో మీరు అనవసర సలహాలు ఇవ్వొద్దు.