By: RAMA | Updated at : 31 Mar 2023 05:32 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
మేష రాశి వారు ఈ రోజు ప్రారంభించిన పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది కానీ కంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శాశ్వత ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రోజు సోమరితనం వీడండి
ఈ రోజు మీకు మంచి రోజు. పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ నైపుణ్యం బయటపడుతుంది. ఈ రోజు మీరు మీకు ఇష్టమైన పనిని పూర్తి చేయడం మీలో సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
అకస్మాత్తుగా ఈ రోజు మీ ఇంటికి ఓ స్నేహితుడు రావొచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక అంశం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది..దీనివల్ల మీరు జీవితంలో ముందుకు సాగడంలో విజయం సాధిస్తారు.
Also Read: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు
ఆర్థికంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..మీరు వాటిని ఉపయోగించుకోవడంలోనే ఉంది అంతా. కుటుంబ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వివాహితులకు మంచి రోజు.
ఈ రోజు ఒడిదుడుకులతో నిండిన రోజు. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. దూరప్రాంత ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది...కానీ దానివల్ల లాభం కన్నా నష్టం ఉండే అవకాశం ఉంది జాగ్రత్త. ప్రశాంతంగా ఉండండి. ఉద్యోగులు పనివిషయంలో జాగ్రత్తగా ఉండాలి
ఈ రోజు కన్యా రాశివారి కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది. కార్యాలయంలో మీ హోదా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!
ఈ రోజు ఈ రాశివారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. నిరాశగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో వివాదం జరగొచ్చు..అనవసరంగా మాట తూలకండి. ప్రేమికులకు మంచి రోజు.
ఈ రోజు మీకు మంచి రోజు. అనుకున్న పని పూర్తవుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రణాళికలు పూర్తవుతాయి. పనిలో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. టైమ్ తప్పిన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
ఈ రోజు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అనుకున్న పనిలో మీకు స్నేహితులు,సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కళాత్మక పనులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు సంబంధంలో కొత్త ఉత్సాహం ఉంటుంది.
ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉంటారు. ఈ రోజు పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఎదుటివారి మాటలను బట్టి కాకుండా మీ మనసు చెప్పింది వినండి.
ఈ రోజు మీకు కొంచెం బలహీనంగా ఉంది..ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితం బాగుంటుంది. తలపెట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితం గడిపే వారు జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజు మీ పని విధానంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఉద్యోగం కోసం పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ శారీరక సౌకర్యాలు పెరుగుతాయి.
జూన్ 6 రాశిఫలాలు, ఈ రాశివారు క్లిష్టమైన విషయాన్ని ఈ రోజు పరిష్కరించుకుంటారు!
జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త
Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!
Katra Vaishnodevi: గుహలో ప్రయాణం , ముగ్గురమ్మలు కొలువుతీర్చిన శక్తి దర్శనం- కట్రా'వైష్ణోదేవి' విశిష్టత తెలుసా!
జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!